వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లగ్జరీ హోటల్లో ఉగ్రదాడి: భారతీయులు బందీ, చైనీస్ వ్యక్తి తీసిన వీడియో ఇదీ...

By Srinivas
|
Google Oneindia TeluguNews

మాలి: పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశ రాజధాని బమాకాలోని రాడిసన్ బ్లూ హోటల్లోకి ఉగ్రవాదులు చొరబడి అందులో ఉన్న వారిని బందీలుగా చేసుకున్నారు. హోటల్లో పదిహేను నుంచి ఇరవై మంది భారతీయులు కూడా బస చేస్తున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి.

దుబాయ్‌కు చెందిన సంస్థ తరఫున వారంతా మాలిలో పని చేస్తున్నారని తెలుస్తోంది. వారు క్షేమంగా ఉన్నారని తెలుస్తోంది. బందీల్లో ఏడుగురు చైనీయులు, ఆరుగురు టర్కిష్ ఎయిర్ లైన్స్ సిబ్బంది ఉన్నారు. మొత్తం 170 మందిని బందీలుగా ఉగ్రవాదులు పట్టుకున్నారు.

Mali terror attack: Chinese hostage shares video of sieged Radisson Blue hotel

క్షేమంగా ఉన్నా: ఆలికోడాన్ గోటే

మాలిలోని తాను లేనని ఆఫ్రికా అత్యంత ధనవంతుడు అలికో డాన్గోటే స్పష్టం చేశారు. నైజీరియాకు చెందిన అలికో డాన్గోటే ఆఫ్రికాలోని అత్యంత ధనవంతుడిగా ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. నిన్నటి వరకు మాలిలో ఉన్నానని, ఈ రోజు లేనని ఆయన చెప్పారు. అతను ఉగ్రదాడి జరిగిన హోటల్లో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.

బందీలను విడిపిస్తున్నారు!

ఉగ్ర చెరలో ఉన్న దాదాపు 80 మంది విడుదలయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఖురాన్ వ్యాఖ్యలుచెప్పిన వారిని కొందరిని వదిలేసినట్లుగా చెబపుతున్నారు. ఇదిలా ఉండగా, మాలి ఘటన పైన అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా ఎప్పటికి అప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నారు.

వీడియో ద్వారా..

బందీల్లో చైనీయులు కూడా ఉన్నట్లు చైనా మీడియా వెల్లడించింది. వీ చాట్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా చెన్‌ అనే వ్యక్తి హోటల్‌లో చిక్కుకుపోయిన చైనీయుల్లో తాను కూడా ఉన్నట్లు చైనా మీడియాకు సమాచారం అందించారు.సదరు చైనా వ్యక్తి ఓ వీడియో తీసి అప్ లోడ్ చేశాడు. అతను ఉగ్రదాడిని కొంత వీడియో తీసినట్లుగా తెలుస్తోంది.

English summary
Jihadists launched a shooting rampage in the Radisson Blu hotel in the centre of the Malian capital Bamako on Friday, Nov 20, security sources and an journalist said. Automatic weapons fire could be heard from outside the 190-room hotel, where security forces have set up a security cordon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X