వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్యాంట్ లోపల పిల్లి పిల్లల్ని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు, ఎలా దొరికాడంటే?

|
Google Oneindia TeluguNews

సింగపూర్: ఓ వ్యక్తి తన ప్యాంట్‌లో నాలుగు పిల్లి పిల్లలను ఎత్తుకెళ్లే ప్రయత్నాలు చేశాడు. ఈ సంఘటన సింగపూర్‌లో జరిగింది. సింగపూర్‌లో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆ పిల్లి పిల్లలను స్వాధీనం చేసుకున్నారు. మలేసియా నుంచి సింగపూర్ వస్తున్న వాహనాలను బోర్డర్ ఎంట్రీ దగ్గర అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

అటుగా వస్తున్న వాహనాన్ని ఆపేశారు. దానిని కూడా చెక్ చేశారు. వారికి ఏమీ కనిపించలేదు. ఆ తర్వాత అతనిని కిందకు దించి చెక్ చేశారు. ఏమీ లేదని భావించి, అతనిని వెళ్లమని చెప్పారు. అతను అక్కడి నుంచి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.

 Man caught trying to smuggle 4 kittens at Malaysia Singapore border by hiding them in his pants

అంతలోనే అతని ప్యాంట్ నుంచి మ్యావ్.. మ్యావ్ అంటూ పిల్లి పిల్లల గొంతు వినిపించింది. షాకైన అధికారులు అతనిని పూర్తిగా చెక్ చేశారు. ప్యాంటు లోపల ఏం దాచావో చూపించమని చెప్పారు.

ఆ వ్యక్తి ప్యాంటులో నుంచి వరుసగా నాలుగు పిల్లి పిల్లలు బయటకు తీశాడు. దీంతో అధికారులు అవాక్కయ్యారు. అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. మలేసియా నుంచి అతను అక్రమంగా వాటిని తీసుకు వస్తున్నట్లు గుర్తించారు. కానీ వాటిని ఎందుకు తీసుకెళ్తున్నాడో తెలియరాలేదు.

కాగా, సింగపూర్‌లో పిల్లులు, కుక్కలు వంటి పెంపుడు జంతువులు తీసుకురావాలంటే ఎన్నో నియమనిబంధనలు ఉన్నాయి. అవసరమైన హెల్త్ సర్టిఫికెట్క్, లైసెన్స్ పొందాలి.

English summary
A man tried to smuggle four live kittens, hidden in his pants, across a security checkpoint at the Malaysia Singapore border, but the meows gave him away.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X