వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమానంలో బీర్ కావాలంటూ వీరంగం: ల్యాండింగ్

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: ఆకాశంలో ఎగురుతున్న విమానంలో ఓ వ్యక్తి తనకు బీరు కావాలంటూ వీరంగం సృష్టించాడు. అంతేగాక, విమానాన్ని కూల్చేస్తానని, మిగితా ప్రయాణికులను చంపేస్తానని బెదిరింపులకు గురిచేశాడు. దీంతో పైలెట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కి ‘ఫ్లైట్ 622' ఫినిక్స్ నుంచి న్యూయార్క్‌కి బయలుదేరింది. ఇంతలోనే జేసన్ బారోలెట్టి(38) అనే వ్యక్తి ఈ సిగరేట్ కాల్చడం మొదలెట్టాడు.

Man denied beer threatened to take down plane: officials

విమాన సిబ్బంది అతడ్ని హెచ్చరించే వరకూ అలాగే కొనసాగించాడు. ఆ తర్వాత బీరు కావాలంటూ హంగామా చేశాడు. ఇందుకు వారు నిరాకరించడంతో.. బీరు ఇస్తారా? లేక విమానాన్ని కూల్చేయాలా? అంటూ బెదిరింపులకు దిగాడు.

మిగితా ప్రయాణికులను చంపేస్తానంటూ కేకలు వేశాడు. దీంతో విమాన సిబ్బంది పైలెట్‌కు సమాచారం అందించడంతో విమానాన్ని కాన్సాస్‌లోని విచీటా విమానాశ్రయంలో దించారు. అధికారులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కొంత సేపటికి విమానం అక్కడ్నుంచి బయల్దేరింది. కాగా, ఘటనపై ఎఫ్‌బిఐ విచారణ జరుపుతోంది.

English summary
The American Airlines flight from Phoenix to New York was forced to divert to Wichita where Jason Baroletti, 38, was arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X