వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్భుతం: 90 నిమిషాలపాటు చనిపోయాడు, 2 వారాలకు బతికాడు, ఎలా?

చనిపోయిన వ్యక్తి బతికితే ఎలా ఉంటుంది? అయితే సినిమాల్లో మాత్రం హీరోలు చనిపోయినా ఏదో అద్భుతం జరిగి బతుకుతారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: చనిపోయిన వ్యక్తి బతికితే ఎలా ఉంటుంది? అయితే సినిమాల్లో మాత్రం హీరోలు చనిపోయినా ఏదో అద్భుతం జరిగి బతుకుతారు. సినిమాల్లో మాదిరిగానే మరో ఘటన ఒకటి అమెరికాలో చోటుచేసుకొంది.90 నిమిషాలపాటు మరణించిన వ్యక్తి రెండువారాల తర్వాత లేచి కూర్చొన్నాడు.

అమెరికాలోని బాల్టిమోర్ ప్రాంతానికి చెందిన ఇంజనీర్ టీజే స్కాన్లాన్ 20 అడుగుల ఎత్తైన గోడపై నుండి ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. అయితే ఆయన 90 నిమిషాలపాటు చనిపోయాడు. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఓ అద్భుతం చోటుచేసుకొంది. రెండు వారాల తర్వాత ఆయన లేచి కూర్చొన్నాడు.

20 అడుగుల ఎత్తైన గోడపై నుండి పడిన స్కాన్లాను రెండురోజుల పాటు ఎవరూ కూడ గుర్తించలేదు. అయితే రెండు రోజుల తర్వాత ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. ఈ ప్రమాదంలో ఆయన ఛాతీ కిందిబాగం చచ్చుపడిపోయింది.

Man dies for 90 minutes after accident, wakes up two weeks later

ఫలితంగా కాళ్ళుపనిచేయడం లేదు. అతడిని ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలోనే కార్డియాక్ అరెస్టు కారణంగా గుండె ఆగిపోయింది. దాదాపు గంటన్నరపాటు గుండెకూడ పనిచేయడం మానేసింది. సాంకేతికంగా స్కాన్లాను చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు.

ప్రమాదం కారణంగా అతడి వెన్నెముక విరిగిపోయింది. కిడ్నీలు, ఊపిరితిత్తులు పనిచేయడం మానేశాయి.రెండురోజులపాటు రక్తపు మడుగులోనే అచేతనంగా పడిఉండడంతో అతడి అవయవాలు నీలంరంగులోకి మారిపోయాయి. శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయింది. కేవలం ఐదు మాత్రమే బతికే అవకాశం ఉండగా వైద్యుల కృషితో రెండు వారాల తర్వాత ఆయన కళ్ళు తెరిచాడు. ఆయన ప్రాణాలతో బతికి బయటపడ్డాడు.

English summary
A man in US’s Baltimore died for 90 minutes after falling down a 20-feet stairwell, and woke up two weeks later. The engineer named TJ Scanlon was undiscovered for two days as he lay in a pool of his own blood, and came back to life in the hospital weeks later.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X