వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొడుకుకు వచ్చిన లెటర్ చదివి జైలుపాలైన తండ్రి

|
Google Oneindia TeluguNews

ఒక్కో దేశంలో చట్టాలు ఒక్కో రకంగా ఉంటాయి. కొన్ని దేశాల్లో అమలవుతున్న చట్టాలు వాటికి విధిస్తున్న శిక్షల గురించి వింటే ఇంత చిన్న విషయానికి అంత పెద్ద పనిష్మెంటా అనిపిస్తుంది. స్పెయిన్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. కొడుకుకు వచ్చిన ఉత్తరాన్ని చదివినందుకు ఓ తండ్రి జైలు పాలయ్యాడు. కుమారుడి ప్రైవసీని దెబ్బతీశారంటూ రెండేళ్ల శిక్ష విధించారు.

వేరే వారి ఉత్తరాలు చదవడం మన దగ్గర కామన్. కొంతమంది సరదాగా ఆటపట్టించేందుకు ఎదుటివారి లెటర్స్ చదువుతుంటారు. స్పెయిన్‌లో మాత్రం ఇదో పెద్ద నేరం. ఇందుకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తారు. సెవిల్లే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి భార్యతో గొడవపడి కొడుకుతో కలిసి వేరుగా ఉంటున్నాడు. భార్యభర్తల మధ్య కోర్టు కేసు నడుస్తోంది. అయితే పదేళ్ల ఆ అబ్బాయికి తల్లితరఫు బంధువు ఒకరు లేఖ రాశారు. అందులో బాలుడి తండ్రిపై గృహహింస కేసుకు సంబంధించిన వివరాల గురించి ఆరా తీశారు. ఆ అబ్బాయి తండ్రిని విమర్శిస్తూ సదరు మహిళ కొన్ని వ్యాఖ్యలు చేసింది. అది చదివిన ఆ తండ్రి కోపంతో ఊగిపోయాడు. భార్య తరఫు బంధువులు తనను వేధిస్తున్నారంటూ కోర్టుకెక్కాడు.

పొట్టి డ్రస్సులు వేసుకురండి..బోనస్ పొందండి: మహిళలా ఉద్యోగులకు ఆ కంపెనీ ఆఫర్!పొట్టి డ్రస్సులు వేసుకురండి..బోనస్ పొందండి: మహిళలా ఉద్యోగులకు ఆ కంపెనీ ఆఫర్!

Man faces two years Jail for opening letter sent to son

లెటర్‌ను సాక్ష్యంగా చూపిన సదరు వ్యక్తి తనపై తప్పుడు గృహహింస కేసు పెట్టారని కోర్టుకు విన్నవించారు. అయితే ఇక్కడే డామిట్ కథ అడ్డం తిరిగింది. సాక్ష్యంగా సమర్పించిన లెటర్‌ను పరిశీలించిన జడ్జి ఆ లెటర్ ఎవరికి వచ్చిందని ప్రశ్నించాడు. కొడుకుకు వచ్చిన లేఖ అని అతను సమాధానం ఇచ్చాడు. ఇంకేముంది పిల్లాడి ప్రైవసీకి భంగం కలిగించారంటూ బాలుడి తల్లి తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. అంతే కోర్టు అతనికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.

English summary
A Spanish man risks spending the next two years in prison for opening a letter addressed to his 10-year-old son and using it as evidence in a trial against the boy’s mother. Spanish city of Seville, a father was accused by the prosecution of violating his child’s privacy by opening a letter addressed to him, which he was not authorised to do.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X