• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆ సీడీలను ధ్వసం చేశారని తల్లిదండ్రులనే కోర్టుకు లాగిన ఘనాపాఠీ ఇతను..!

|

తమ పిల్లలు ఏం చేస్తున్నారో ఎక్కడ తిరుగుతున్నారో... ఎలాంటి కొత్త అలావాట్లు నేర్చుకుంటున్నారనే దానిపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకుంటే పిల్లలు హద్దులు దాటుతున్నారు. తాజాగా శృంగార భరిత వీడియోలకు అలవాటు పడిన ఓ కొడుకు ఏకంగా తల్లిదండ్రులనే కోర్టుకు లాగాడు. వారు నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేశాడు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది... ఆ స్టోరీ ఏంటి..?

 శృంగార భరిత చిత్రాలకు అలవాటు పడిపోయిన చార్లీ

శృంగార భరిత చిత్రాలకు అలవాటు పడిపోయిన చార్లీ

అమెరికా దేశం మిషిగాన్ నగరానికి చెందిన చార్లీ అనే యువకుడు పోర్న్ వీడియోలకు అలవాటు పడిపోయాడు. పోర్న్ వీడియోలు చూడకుండా నిద్రపోయేవాడు కాదట. అంతేకాదు ఈ శృంగార భరిత వీడియోలకు అలవాటు పడి ఏకంగా భార్యకే విడాకులు ఇచ్చేసిన ఘనాపాఠీ చార్లీ. రోజు పోర్న్ వీడియోలు చూస్తుండటంతో చార్లీ దంపతుల మధ్య గొడవ జరిగేది. అప్పటికీ ఓ ఇంట్లో అద్దెకు ఉన్న చార్లీని 2017లో ఆ ఇంటి యజమాని ఇల్లును ఖాళీ చేయించాడు. ఆ తర్వాత 10 నెలల పాటు తన తల్లిదండ్రులతో కలిసే ఉన్నాడు. ఆ సమయంలో కూడా ప్రతిరోజు పోర్న్ వీడియోలను చూస్తుండటాన్ని గమనించిన తల్లిదండ్రులు కొడుకు ఏమై పోతాడో అనే ఆందోళనకు గురయ్యారు.

పోర్న్ కలెక్షన్‌ను ధ్వంసం చేసిన చార్లీ తండ్రి

పోర్న్ కలెక్షన్‌ను ధ్వంసం చేసిన చార్లీ తండ్రి

కొడుకు చార్లీ రోజు శృంగార భరిత వీడియోలను చూస్తుండటంతో మానసిక ఆరోగ్యం దెబ్బతినిందని తల్లిదండ్రులు వాపోయారు. దీంతో వారు కూడా అతన్ని ఇండియానాలోని మరో నివాసంలో ఉండాల్సిందిగా చెప్పి ఇంట్లోనుంచి బయటకు పంపారు. ఇండియానా నివాసానికి చేరుకున్న తర్వాత చార్లీకి సంబంధించిన వస్తువులన్నీ మరోరోజు పంపారు. కానీ అందులో అతనికి సంబంధించిన పోర్న్ వీడియో సీడీలను పంపలేదు. వాటి గురించి వాకబు చేయగా ఆ వీడియో సీడీలను ధ్వంసం చేసినట్లు తల్లిదండ్రులు చెప్పారు. పోర్న్ కలెక్షన్ కోసం చాలా కష్టపడినట్లు చెప్పిన చార్లీ తల్లిదండ్రులు చేసిన పనిపై ఆగ్రహంతో ఊగిపోయి వారిని కోర్టుకు లాగాడు.

 రూ.20 లక్షలు నష్టపరిహారం చెల్లించాలంటూ కోర్టుకు చార్లీ

రూ.20 లక్షలు నష్టపరిహారం చెల్లించాలంటూ కోర్టుకు చార్లీ

ముందుగా ఒటావా కౌంటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు చార్లీ. ఆ తర్వాత కోర్టుకు వెళ్లాడు. పోర్న్ కలెక్షన్ ధ్వసం చేసిన తల్లిదండ్రులపై కేసు నమోదైంది. మొత్తం పోర్న్ వీడియోల కలెక్షన్ విలువ 29వేల డాలర్లుగా పేర్కొన్నాడు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.20 లక్షలకు పైమాటే. ఆ మొత్తాన్ని నష్టపరిహారంగా చెల్లించాలంటూ కోర్టులో పిటిషన్ వేశాడు. పోర్నో వీడియోలతో ఇప్పటికే చార్లీ ఆరోగ్యం దెబ్బతినిందని అందుకే ఆ వీడియో సీడీలను ధ్వంసం చేసినట్లు తండ్రి చెప్పాడు. ఆ సీడీలను ధ్వంసం చేసేందుకు చాలా సమయం పట్టిందని పేర్కొన్నాడు. తన మంచి కోసమే ఇలా శృంగార భరిత సీడీలను ధ్వంసం చేసినట్లు చార్లీ తండ్రి వివరణ ఇచ్చారు.

మొత్తానికి ఇలాంటి అశ్లీల వీడియోలను పిల్లలు చూస్తూ మానసికంగా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. అలా అనీ తల్లిదండ్రులు వారిని కట్టడికి గురిచేస్తే పిల్లలు మరింత మితిమీరి ప్రవర్తించే అవకాశం ఉందని చెబుతున్నారు మానసిక వైద్యులు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A US couple is being sued by their son for destroying his porn collection, which he claimed was worth $29,000 (over ₹20 lakh). The son, who said his collection included some rare and out-of-print movies, is seeking over $86,000 in damages. "I destroyed your porn for your own mental and emotional health," his father reportedly wrote in an e-mail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more