వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటర్నెట్‌ను గెలిచిన యువకుడి దయ: ఫస్ట్ క్లాస్ సీటు వృద్ధురాలికి, ఎకానమీ క్లాస్‌లో 7 గంటల జర్నీ

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ బస్సులో కూర్చొన్న సీటును ఇవ్వడానికి కొందరు ముందుకురారు. మరికొందరైతే గర్భవతులు, వృద్ధులు అని కూడా కనికరించరు. కానీ ఆ యువకుడు ఔదార్యం చూపించారు. సాదా సీదగా కాదు.. విమానంలో తన ఫస్ట్ క్లాస్ సీటును ఓ వృద్దురాలికి అందజేసి ఎకానమీ సీటులో కూర్చొన్నారు. విమానంలో జరిగిన ఘటనకు సంబంధించిన ఫోటోలు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో వైరలయ్యాయి. ఆ యువకుడిని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

జాక్ ఔదార్యం..

జాక్ ఔదార్యం..

అమెరికాకు చెందిన జాక్ లిటిల్‌జాన్ యువకుడు, కుటుంబానికి చెందిన చారిటీ సంస్థ పనులు చూసుకుంటారు. జాక్‌కు తల్లి, సోదరి ఉన్నారు. ఆయన ఇటీవల న్యూయార్క్ నుంచి లండన్ వర్జీన్ అట్లాంటిక్ విమానంలో వెళుతున్నారు. ఫస్ట్ క్లాస్ టికెట్ బుక్ చేసుకున్నారు. కానీ అతని తల్లి విమానంలో ప్రయాణించే సమయంలో వృద్ధులు, ఇబ్బంది పడేవారికి టికెట్ కేటాయించాలని సూచించారు. ఈ మేరకు జాక్ దానిని అమలు చేశారు.

జోక్ అని..

జోక్ అని..

వైలెట్ అల్లినన్ అనే 88 ఏళ్ల వృద్ధురాలు న్యూయార్క్ నుంచి లండన్ వెళుతున్నారు. ఆమెను చూసిన జాక్.. ఎలాగైనా తన సీటు ఇవ్వాలని అనుకొన్నాడు. ఎకానమీ క్లాసులో కూర్చొన్న ఆమె వద్దకొచ్చి.. ఫస్ట్ క్లాస్‌లో పయనిస్తారా అని అడిగారు. ఓ యువకుడు తన వద్దకొచ్చి సీటు ఇస్తానని చెప్పడం.. అదీ కూడా ఫస్ట్ క్లాస్ అనడంపై అల్లిసన్ నమ్మలేదు. జోక్ చేస్తున్నారు కదా అని అన్నారు.

ఇవీ ప్రయోజనాలు..

ఇవీ ప్రయోజనాలు..

నిజం అని జాక్ బదులిచ్చారు. ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణించడంతో మీకు అన్నీ సౌకర్యాలు కలిగే వెసులుబాటు ఉంటుందని వివరించారు. భోజనం, డ్రింక్స్, మంచి బెడ్ కూడా ఉంటుందని, దీంతో మీరు రెస్ట్ తీసుకోవచ్చని జాక్ వివరించారు. న్యూయార్క్ నుంచి లండన్‌కు ఏడుగంటల ప్రయాణం.. ఫస్ట్ క్లాస్ ప్రయాణంతో సౌకర్యవంతంగా జర్నీ చేయొచ్చని తెలిపారు. తర్వాత అల్లిసన్ బ్యాగు, లగేజీ తీసుకొని డబుల్ డెక్కర్ విమానంలో ఫస్ట్ క్లాస్ క్యాటగిరీకి వెళ్లారు. అక్కడ తనకు కేటాయించిన సీటును అల్లిసన్‌ను కూర్చొబెట్టారు.

ఎకానమీ క్లాస్‌లో జాక్

ఎకానమీ క్లాస్‌లో జాక్

తర్వాత ఎకానమీ క్లాస్‌లో అల్లిసన్‌ సీట్లో జాక్ ప్రయాణించారు. ఏడుగంటల పాటు సీట్లోనే కూర్చొన్నారు. టాయిలెట్ దగ్గరలో గల సీటులో ఎలాంటి విసుగు లేకుండా కూర్చొన్నారు. ఓ వృద్ధురాలికి సాయం చేశాననే కృతజ్ఞత తప్ప జాక్ మొహంలో మరేమీ కనిపించలేదు. తన సీటును త్యాగం చేశాననే బాధ, విసుగు లాంటివి కనిపించలేవు.

ఫోటో వైరల్

జాక్, అల్లిసన్ సీటు కేటాయింపునకు సంబంధించి ఫోటోలు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు జాక్‌ మంచి మనస్సు అని కొనియాడుతున్నారు. ఆయన దయగల మనిషి అంటు ప్రశంసిస్తున్నారు. చాలా మంది హార్ట్ రూపంలో ఉన్న ఎమోజీని షేర్ చేశారు. వారి విమానం లండన్‌లో ల్యాండయ్యాక.. అల్లిసన్ వద్దకు జాక్ వెళ్లారు. అప్పుడూ వారిద్దరూ కలిసి సెల్ఫీ తీసుకొన్నారు. ఆ ఫోటోలో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి.

English summary
Violet Allison was just getting settled into her economy seat another passenger walked up to her row and asked her a question would you like to fly first class.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X