వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాక్షస జంతువు కోసం... 25 ఏళ్లుగా సరస్సు ఒడ్డునే...

ఉందో, లేదో తెలియని ఓ రాక్షస జంతువు కోసం ఓ వ్యక్తి చేస్తున్న ఉద్యోగం వదిలేసి, ఉంటున్న ఇంటిని అమ్మేసి.. ఓ సరస్సు ఒడ్డునే 25 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజం!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

స్కాట్లాండ్ : సూర్యుడిని చూడాలనుకుంటే.. పన్నెండు గంటలు వేచి చూస్తే చాలు. రాత్రి పగలవగానే సూర్యుడు దర్శనమిస్తాడు. అలాగే పుట్టబోయే బిడ్డను చూడాలనుకుంటే.. తొమ్మిది నెలలు వేచి చూడాలి.

కానీ ఒక రాక్షస జంతువును చూసేందుకు ఒక మనిషి గత 25 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు. ఇన్నేళ్లపాటు ఎదురు చూడటానికి ఎంత సహనం కావాలి? అందుకేనేమో ఈ వ్యక్తి ఎదురుచూపులు గిన్నిస్ బుక్ లోకి కూడా ఎక్కాయి.

వివరాల్లోకి వెళ్తే... ఇంగ్లండ్ కు చెందిన ఓ వ్యక్తి గత 25 ఏళ్లుగా స్కాట్లాండ్ లోని లోచ్ నెస్ సరస్సు ఒడ్డున ఎదురుచూస్తున్నాడు. ఎందుకంటే.. ఈ సరస్సులో మాత్రమే లోచ్ నెస్ మాన్ స్టర్ లేదా నెస్సీ మాన్ స్టర్ అనే రాక్షస జంతువు జాతి నివసించేదని చెప్పుకుంటారు.

man's 25 years looking for Loch Ness Monster

ఈ విషయం పాతికేళ్ల క్రితం ఫాల్తమ్ అనే వ్యక్తి చెవిన పడింది. అప్పుడు అతడి వయస్సు 24 ఏళ్లు. అంతే.. ఎలాగైనా ఆ రాక్షస జంతువును చూడాలనుకున్నాడు. దానికోసం చేస్తున్న ఉద్యోగం వదిలేశాడు. ఇంగ్లండ్ లోని డోర్సెట్ ప్రాంతంలో ఉన్న తన ఇంటిని అమ్మేశాడు.

వచ్చిన డబ్బుతో ఒక మొబైల్ హోమ్ ను కొన్నాడు. దాన్ని లోచ్ నెస్ సరస్సు ఒడ్డున దాన్ని ఏర్పాటు చేసుకుని ఆ రాక్షస జంతువు కోసం ఎదురుచూడడం ప్రారంభించాడు. అలా ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు 25 ఏళ్లుగా అక్కడే నివసిస్తూ దాని కోసం ఎదురు చూస్తున్నాడు.

ఇన్నేళ్లు గడిచినా ఆ రాక్షస జంతువు జాడ కానరాలేదు. అసలు ఆ జాతికి చెందిన జంతువు ఒక్కటైనా బతికి ఉందో లేదో కూడా తెలియదు. అయినా సరే, తనకు ఇలా జీవించడమే నచ్చిందని, ఇలాగే ఎదురుచూస్తూ ఉంటానని ఫాల్తమ్ అంటున్నాడు.

మరోవైపు ఇలా రాక్షస జంతువు కోసం ఇన్నేళ్లుగా అతడు ఎదురు చూస్తున్నాడన్న విషయం గిన్నిస్ బుక్ వారికి తెలిసింది. దీంతో సుదీర్ఘకాలంగా నెస్సీ మాన్ స్టర్ కోసం ఎదురుచూసిన వ్యక్తిగా అతడికి గిన్నిస్ బుక్ లో చోటు లభించింది. మరి.. ఆ జంతువు ఎప్పుడు కనిపిస్తుందో, దాని కోసం ఇతడు ఇంకెన్నేళ్లు ఇలా ఎదురు చూస్తాడో.. భవిష్యత్తే నిర్ణయించాలి!

English summary
Mr Feltham, who began his search in 1991 and has been fascinated by the mystery since childhood, said: "I look at 25 years as a good halfway mark in trying to solve this. "I am willing to dedicate another 25 years. Hopefully it will only take another few weeks. Who knows? "When I first came here I had no clear idea how long I would need. But I thought I would see something in three years."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X