viral video: ఇదేం లవ్ ప్రపోజల్రా అయ్యా.. మెక్ డొనాల్డ్స్ లైన్లోనే అలా.. దూల తీరిందా...?
ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో తెలియదు. కానీ ఇద్దరు పరస్పర అంగీకారంతో లవ్ చేసుకుంటారు. ఏ ఒక్కరికీ నచ్చకున్నా అదీ లవ్ కానే కాదు. అవును అయితే ప్రపోజ్ చేసే సమయం.. సందర్భం కూడా ఇంపార్టెంట్.. కూల్‌గా ఉండేచోట.. గుడిలోనో.. కేఫ్‌లోనో నెమ్మదిగా ప్రపోజ్ చేయాలి. కానీ కొందరికీ ఉత్సాహం ఎక్కువ.. అలా ప్లో లో చెప్పేస్తారు. ఇంకేముంది తిరస్కరణకు గురవ్వడంతో.. బాధపడిపోతుంటారు. అలా సౌతాఫ్రికాలో కూడా ఒక ఘటన జరిగింది. అయితే అందుకు అతను మెక్ డొనాల్డ్స్‌ను వేదికగా చేసుకున్నాడు. చుట్టూ అందరూ ఉన్నారు. వీడియోలు తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేశారు.

యువతి నిల్చొని ఉండగా ఇదేం పని
జోహన్నెస్ బర్గ్ మెక్ డొనాల్డ్స్ కేఫే అదీ. రద్దీగా ఉంది. ఆర్డర్ కోసం చాలా మంది లైన్లో ఉన్నారు. అయితే ఓ యువతి కూడా నిల్చొని ఉంది. ఆమె వెనకాల యువకుడు ఉన్నాడు. వారి మధ్య అప్పటికే పరిచయం ఉంది. కానీ ఆ సమయంలో మనొడు మాట మాట కలిపాడు. ఆమె వెనకాల కార్డుతో గీకాడు. దీంతో ఆమెకు చిర్రొత్తుకు వచ్చింది. వెంటనే తిట్టిపోసింది. అయినప్పటికీ తనకు కావాల్సిన తిను బండారాలను ఆర్డర్ చేసే పనిలో ఉంది. అప్పటికే ఊరుకుంటే సరిపోయేది.. మరోసారి అలానే చేశాడు. దీంతో ఆమెకు చిర్రెత్తుకు వచ్చింది. మరోసారి ఫైరయ్యింది. తన వస్తువులు వచ్చేసిన అక్కడే ఉన్న స్టాండ్‌లో వేసి వెళ్లిపోయింది.

తిరస్కరణ..
ఈ క్రమంలో అతను ప్రపోజ్ చేయడం.. ఆమె తిరస్కరించడం జరిగిపోయింది. అక్కడినుంచి కోపంగా వెళ్లిపోయింది. అతను కూడా స్టాండ్ తీసుకొని.. చిరునవ్వుతో బయల్దేరాడు. అక్కడున్న వారి అరుపులు వినిపించాయి. ఈ వీడియోను మేడమ్ ఫసెట్టి పోస్ట్ చేశారు. అదీ తెగ వైరల్ అయ్యింది. ఇప్పటికే 3.7 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 66.3కే మంది లైక్ చేశారు. 10.8కే రీ ట్వీట్ కూడా చేశారు. చాలా మంది రిప్లై కడూడా చేశారు. ఒక్కొక్కరు ఒకలా కామెంట్ చేశారు.

సినిమానా నాయనా..?
మెక్ డొనాల్డ్స్‌లో ప్రపోజ్ చేయడం ఏంటీ.. ఇదేమైనా సినిమా అనుకున్నావా అని ఒకరు అడిగారు. ఇలా పబ్లిక్ ప్లేసులో ప్రపొజ్ చేయడం ఏంటీ అని మరొకరు కామెంట్ చేశారు. రిజెక్ట్ చేయడానికి ఆ మహిళకు తన కారణాలు ఉంటాయని మరొకరు కామెంట్ చేశారు. ఆమెకు లవ్ విషయం చెప్పే ముందు ఇష్ట, ఇష్టాలు తెలుసుకొని మెదులుకుంటే బాగుండేదని చెబుతున్నారు. చాలా మంది ఆ వీడియోకు తమకు అర్థం కాలేదని కామెంట్ చేశారు. అందులో ప్రేమను వ్యక్తం చేసిన వ్యక్తి ఎవరో తెలియడం లేదని అభిప్రాయపడ్డారు. ఆమెకు రింగ్ ఇచ్చిన బాగుండేదని మరొకరు కామెంట్ చేశారు.
Witnessed such a sad situation today yoh 💔 pic.twitter.com/RPFvMS7bga
— ⭐️Certified Fixer⭐️ (@Madame_Fossette) April 27, 2022