తల నరికేసి, గుండెను బయటకు తీసి చంపేశారు
వాషింగ్టన్: అమెరికాలో ఓ రౌడి ముఠా ఓ వ్యక్తిని బుధవారం అతి కిరాతకంగా హతమార్చి పబ్లిక్ పార్కులో పాతి పెట్టింది. ఈ ఘటన అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో చోటు చేసుకొంది.. దాదాపు 100 కత్తి పోట్లు వ్యక్తి శరీరంపై ఉన్నట్లు మాన్ట్గోమెరీ కౌంటీ పోలీసులు తెలిపారు. ఈ హత్యను అల్ట్రా వైలెంట్ లాటినో స్ట్రీట్ గ్యాంగే చేసి ఉంటుందని అనుమానిస్తున్నారు.
ఇప్పటివరకూ ఓ అనుమానితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు. హత్యకు గురైన వ్యక్తి తల నరికేశారని పోలీసులు ప్రకటించారు. గుండెను కోసి బయటకు తీశారు. ఈ హత్యకు కొన్ని వారాల నుంచి కుట్ర చేశారనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.

అల్ట్రా వైలెంట్ లాటినో స్ట్రీట్, మారా సల్వట్రుచా(ఎంఎస్-13) అనే గ్యాంగ్‌లు అమెరికాలో దారుణాలకు పాల్పడుతన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ రెండు గ్రూపులను లేకుండా చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు మార్లు చెప్పారు. ఎంఎస్-13లో దాదాపు 10 వేల మంది గ్యాంగ్స్టర్లు ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.