వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నడి సంద్రంలో మునిగిన ఓడ.. రెండురోజులు ఈది, చివరకు ఇలా..

|
Google Oneindia TeluguNews

ఓడ నడి సముద్రంలో మునిగిపోయింది. చుట్టూ ఎటూ చూసినా నీరు.. బతికే అవకాశం లేదు.. అలాంటి సమయంలో ఓ వ్యక్తి అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించాడు.. 48 గంటల పాటు సముద్రంలో ఈదుతూనే ఉన్నాడు. ప్రతిక్షణం ప్రాణ భయంతో గడిపాడు. చివరకు రక్షక దళాలు రావడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. అట్లాంటిక్ మహా సముద్రంలో ఈ ఘటన జరిగింది.

లైబీరియా రాజధాని మన్రోవియా తీరం నుంచి నికో ఇవాంకా కార్గో షిప్ ఈ నెల 17న బయల్దేరింది. దీనిలో మొత్తం 28 మంది సిబ్బంది ఉన్నారు. ఆ రోజు మధ్యాహ్నం ఆ ఓడ సముద్రం మధ్యలో ప్రమాదానికి గురయ్యింది. దీంతో సిబ్బంది పోర్ట్ అధికారులకు సమాచారం అందించారు. రెస్క్యూ సిబ్బంది వెళ్లే సరికి ఓడ దాదాపు మునిపోయింది. 11 మందిని వారు రక్షించగలిగారు. మరో 17 మంది ఆచూకీ తెలియలేదు.

man stranded in sea for 48 hours

కొద్ది గంటల తర్వాత మరో వ్యక్తిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. అప్పటికే ఓడ మునిగిపోయి 48 గంటలు దాటింది. అన్ని గంటల పాటు అతను సముద్రంలో ఈదుతూనే ఉన్నాడు. నమ్మకం కోల్పోకుండా తన ప్రాణం కాపాడుకునేందుకు ప్రయత్నించాడు. చివరకు ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ దానిని గుర్తుచేసుకుంటూనే భయమేస్తుందని చెప్పారు. అసలు ఎలా వచ్చానో తెలియదని పేర్కొన్నారు. ఈదుకుంటూ రావడం.. నిజంగా గ్రేట్ అని.. ప్రతీ క్షణం ఆ ఘటన కళ్లముందు కదలాడుతోందని వివరించారు.

నడి సంద్రంలో ఓడ మునగడం.. ఈదుకుంటూ రావడం నిజంగా గ్రేటే.. గంటనో రెండు గంటలో అయితే ఓకే.. రెండురోజులు ఈది.. ప్రాణాలు నిలబెట్టుకోవడం అంటే మాటలు కాదు.

English summary
man stranded in sea for 48 hours after his ship sank
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X