వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్వేత సౌధం ముందు దుస్తులిప్పేసి నగ్నంగా

By Pratap
|
Google Oneindia TeluguNews

Man strips naked outside White House
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నివాసం శ్వేతసౌధం ముందు ఓ వ్యక్తి నగ్నంగా నిరసన వ్యక్తం చేశాడు. ఒక్కొక్కటే దుస్తులిప్పేసి అతను నిరనన వ్యక్తం చేశాడు. ఒబామా ప్రసంగించడానికి కొద్ది నిమిషాల ముందు శ్వేత సౌధానికి చేరుకుని నేరుగా ద్వారం ముందుకు వచ్చాడు. ఒక్కటొక్కటిగా దుస్తులను విప్పేసి నగ్నంగా నించున్నాడు.

ఆ వ్యక్తి చర్యతో కాసేపు గుడ్లు తేలిసినా వెంటనే సీక్రెట్ సర్వీస్ అధికారులు అతడి వద్దకు చేరుకుని అతని ఒంటిపై ఓ పాయిల్ షీట్ కప్పేసి, అతడిని అదుపులోకి తీసుకని ఓ వ్యాన్‌లో అక్కడి నుంచి తరలించారు. అతన్ని సీక్రెట్ సర్వీసు అధికారులు అదుపులోకి తీసుకోవడానికి ముందే అతన్ని కొంత మంది చిత్రించారని తెలుస్తోంది.

అమెరికాకు కొత్త గృహనిర్మాణ శాఖ మంత్రిని ఎంపికే చేసిన ఒబామా ఆ విషయాన్ని ప్రకటించడానికి రాబోతుండగా ఈ సంఘటన జరిగింది. ఆ వ్యక్తికి సీక్రెట్ సర్వీస్ అధికారులు మిచెల్ బెచార్డ్‌గా నామకరణం చేశారు.

నగ్నంగా ఉన్న వ్యక్తిని నియంత్రించడానికి ముగ్గురు అధికారులు ప్రయత్నిస్తున్న దృశ్యాలు ఫేస్‌బుక్‌లో హల్ చల్ చేస్తున్నాయి.

English summary

 US Secret Service personnel sprang into action Friday outside the White House when a man stripped naked in what appeared to be a bizarre form of protest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X