వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనాపై వాడీ-వేడి చర్చ: బ్రెజిల్ అధ్యక్షుడి వీడియో కాన్ఫరెన్స్‌లో నగ్నంగా స్నానం చేస్తూ..!

|
Google Oneindia TeluguNews

బ్రెసిలియా: కరోనా లాక్‌డౌన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా నేతలు ఎక్కువగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా పలు పొరపాట్లు జరగడం సాధారణమే. కానీ, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బాల్సోనారో నిర్వహించిన సమావేశంలో మాత్రం ఘోరమైన పొరపాటు చర్చనీయాంశంగా మారింది.

భారత్‌లో కరోనావైరస్: ఫలితం తేల్చనున్న 'మే’, నిపుణుల సూచనిలివే..భారత్‌లో కరోనావైరస్: ఫలితం తేల్చనున్న 'మే’, నిపుణుల సూచనిలివే..

నగ్నంగా స్నానం చేస్తూ..

నగ్నంగా స్నానం చేస్తూ..


దేశంలో కరోనా లాక్‌డౌన్ పరిస్థితులపై బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే, ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఓ వ్యక్తి నగ్నంగా కనిపించాడు. తన కెమెరా బంద్ చేయకుండానే స్నానం చేశాడు. దీంతో అతనికి సంబంధించిన దృశ్యాలు అధ్యక్షుడితోపాటు అందిరికంటా పడ్డాయి.

ఆ వ్యక్తి ఓకేనా అంటూ అధ్యక్షుడు..

ఆ వ్యక్తి ఓకేనా అంటూ అధ్యక్షుడు..


ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ సావో పాలో అధ్యక్షుడు పాలో స్కాఫ్ మాట్లాడుతున్న సమయంలో బాల్సోనారో ఆ దృశ్యాన్ని గమనించారు. పాలో.. అక్కడ మూలకు ఉన్న బాక్సులో కనిపిస్తున్న వ్యక్తి సరిగ్గానే ఉన్నాడా? అని అధ్యక్షుడు ప్రశ్నించారు.

వాడీ వేడి చర్చ.. చన్నీటి స్నానం అంటూ..

వాడీ వేడి చర్చ.. చన్నీటి స్నానం అంటూ..

‘అక్కడ ఓ వ్యక్తి బట్టలులేకుండా స్నానం చేస్తున్నాడు. ఈ సమావేశంలో వాడి వేడి చర్చ జరుగుతున్న క్రమంలో అతడు చల్లబడేందుకు ఇలా చన్నీటి స్నానం చేస్తున్నాడు' అని పరిశ్రమల శాఖ మంత్రి పాలో గ్యూడెస్ అధ్యక్షుడికి సమాధానం చెబుతూ ఛమత్కరించారు.

బ్రెజిల్‌లో లక్షకు చేరువలో యాక్టివ్ కేసులు


కాగా, ఆ వీడియో కాన్ఫరెన్స్‌కు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఆ స్నానం చేసిన వ్యక్తి ఎవరో మాత్రం అధికారికంగా వెల్లడికాలేదు. అధ్యక్షుడి సమావేశంలో ఇలా జరగడం ఇప్పుడు ఆ దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. పొరపాట్లు జరగడం సాధారణమే అయినప్పటికీ ఇలా జరగడం కొంత ఎబ్బెట్టుగా అనిపించిందంటూ ఆ వీడియోపై నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
బ్రెజిల్ దేశంలో ఇప్పటి వరకు 2,41,080 మంది కరోనా బారిన పడగా, 16,122 మంది మరణించారు. 94,122 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఈ దేశంలో 1,30,836 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

English summary
Brazilian President Jair Bolsonaro’s video call with officials and ministers to discuss the impact of lockdown turned embarrassing. A person in the group accidentally broadcast his naked body as he had forgotten to turn off the camera.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X