వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదేం వింత: వెన్నునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన వ్యక్తికి కొత్త సమస్య..ఏంటో తెలిస్తే షాకే..!

|
Google Oneindia TeluguNews

అసలే కరోనావైరస్‌ బెంబేలెత్తిస్తుంటే ఈ సమయంలో కొత్త వ్యాధులు మరింత కలవరపాటుకు గురిచేస్తున్నాయి. హాస్పిటల్‌కు ఒక వ్యాధి వచ్చిందని వెళితే మరో కొత్త వ్యాధి పలకరిస్తోంది. తాజాగా ఇలాంటి ఉదంతమే బ్రెజిల్‌లో చోటుచేసుకుంది.

బ్రెజిల్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తి తన వీపు కింది భాగాను నొప్పిగా ఉందని హాస్పిటల్‌కు వెళ్లాడు. హాస్పిటల్‌లో స్కానింగ్ తీసిన డాక్టర్లు ఆ వ్యక్తికి షాకింగ్ న్యూస్ చెప్పారు. తనకు రెండు కిడ్నీలు కాకుండా మూడు కిడ్నీలు ఉన్నాయని చెప్పారు. మళ్లీ అనుమానం వచ్చిన వైద్యులు సీటీ స్కాన్ తీశారు. అయితే ఇక్కడ మరో సమస్య ఆ వ్యక్తిలో కనిపించింది. తన వెన్నులో ఒక డిస్క్ జారిపోయిందని చెప్పారు. అయితే అతని శరీరంలో కూడా ఏదో లోపం ఉందని గ్రహించారు. సాధారణంగా మనిషికి ఉండే రెండు కిడ్నీలు కాకుండా మూడు కిడ్నీలు ఉండటాన్ని గమనించారు. ఇక రెండు కిడ్నీలు సాధారణంగా ఎడమవైపు ఉండగా మరో కిడ్నీ కుడివైపు ఉన్నట్లు గమనించారు.

Man with back pain finds out he has 3 kidneys, surprised

ఇదిలా ఉంటే అతనికి కిడ్నీ సమస్య లేదా అలాంటి లక్షణాలు కూడా ఏమీ లేవు. ఈ మూడు కిడ్నీలు సరిగ్గానే పనిచేస్తున్నాయని వైద్యులు చెప్పారు. సాధారణంగా యూరినరీ బ్లాడర్‌కు కిడ్నీలు కనెక్ట్ అయి ఉంటాయి. కానీ ఈ వ్యక్తికి మాత్రం పొత్తికడుపు కింద ఉండే కిడ్నీ బ్లాడర్‌కు కనెక్ట్ అయి ఉంది. ఇదిలా ఉంటే మరో పొత్తి కడుపు వద్ద ఉండే కిడ్నీ సాధారణ కిడ్నీకి కనెక్ట్ అయి ఉంది. పిండం అభివృద్ధి సమయంలో ఇది తలెత్తుతుందని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో కిడ్నీ సమస్యలకు సంబంధించి లక్షణాలు కనిపించవు కాబట్టి, ఎప్పుడైనా అరుదుగా ఇవి బయటపడినప్పుడే ఇలాంటి అసాధరణ పరిస్థితి గురించి ప్రపంచానికి తెలుస్తుందని వెల్లడించారు.

English summary
When a Brazilian man went to the doctor complaining of low-back pain, his doctors got a surprise: They discovered that the man had not two, but three kidneys — a very rare condition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X