వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్ సీఈఓగానే కొనసాగుతా...రాజీనామా వార్తలపై మార్క్ జుకర్‌బర్గ్ స్పందన

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: గత కొద్దిరోజులుగా ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సంస్థ సీఈఓగా మార్క్ జుకర్ బర్గ్ బాధ్యతల నుంచి తప్పుకుంటారని వస్తున్న వార్తలపై స్వయంగా జుకర్ బర్గ్ స్పందించారు. ఫేస్‌బుక్ సీఈఓగా తాను రాజీనామా చేసే యోచన లేదన్నారు జుకర్ బర్గ్. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో దిగ్గజం ఫేస్‌బుక్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై ఆ సంస్థ ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షెరిల్ శాండ్‌బర్గ్‌కు కూడా అండగా నిలిచారు జుకర్ బర్గ్.

తమ సంస్థకు షెరిల్ సేవలు ఎంతో అవసరమన్నారు జుకర్ బర్గ్. సంస్థలో తలెత్తిని పరిణామాలను, సమస్యలను చాకచక్యంగా షెరిల్ డీల్ చేశారని జుకర్ బర్గ్ కొనియాడారు. 10 ఏళ్లుగా కంపెనీలో భాగస్వామిగా ఉంటున్నారని చెప్పిన జుకర్‌బర్గ్... ఇద్దరు కలిసి సంస్థ నిర్మాణం కోసం చాలా కష్టపడినట్లు చెప్పారు. ఇది మరో పదేళ్ల పాటు కొనసాగాలని జుకర్ బర్గ్ ఆకాంక్షించారు.

Mark Zuckerberg says no plans to resign from Facebook

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ పలు సమస్యల్లో చిక్కుకుంది. దీంతో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. 2016లో ఫేస్‌బుక్ వేదికగా రష్యా అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకుందన్న ఆరోపణలు రావడంతో వ్యక్తిగత విషయాలు బయటకు పొక్కుతున్నాయన్న ఆరోపణలు ఫేస్‌బుక్ మూటగట్టుకుంది. అంతేకాదు ఒక ప్రజాసంబంధాల కంపెనీ ద్వారా సిలికాన్ వ్యాలీలోని ఇతర కంపెనీల గురించి కట్టుకథలు ఫేస్ బుక్ అల్లిందని ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స కథనం ప్రచురించింది. అయితే ఇది అవాస్తవమని మార్క్ జుకర్ బర్గ్ చెప్పారు.

కళ్లతో చూసేది అంతా నిజం కాదని ఒక సంస్థపై ఆరోపణలు చేసే ముందు దాని వెనకున్న కథను తెలుసుకోవాలని పలు పత్రికలకు స్వయంగా తానే చెప్పినట్లు మార్క్ జుకర్ బర్గ్ చెప్పారు. అయినప్పటికీ ఆ పత్రికలు అవాస్తవాలు ప్రచురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీలో పలు సమస్యలున్నాయన్న మాట నిజమే అని చెప్పిన మార్క్... ఇప్పుడు అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్పారు.

English summary
Embattled Facebook CEO Mark Zuckerberg said on Tuesday he has no plans to resign, sounding defiant after a rough year for the social platform.“That’s not the plan,” Zuckerberg told when asked if he would consider stepping down as chairman.He also defended Facebook chief operating officer Sheryl Sandberg, who has drawn criticism over her handling of the social media giant’s recent crises.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X