వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ రింగులో మీ ఫింగరు ఉంటే చాలు... చెల్లింపు ఇక బేఫికర్!

అమెరికాలోని లాస్ వెగాస్ లో జరుగుతున్న 'కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో'లో 'టాప్పీ' అనే ఉంగరాన్ని ఆవిష్కరించారు. వైర్ లెస్ పేమెంట్ చిప్ లను కలిగి ఉండే ఈ ఉంగరంతో చెల్లింపులు జరపవచ్చు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

లాస్ వేగాస్: ఉంగరాలను ధరించడం ఒక ఫ్యాషన్. ప్రేమానుబంధాలకు చిరకాల గుర్తులుగా రింగులు మార్చుకుంటూ ఉంటారు. మరి అందరూ ఇష్టపడే అలాంటి రింగులతోనే చెల్లింపులు చేయగలిగితే?

హాంగ్ కాంగ్ కు చెందిన టాప్పీ అనే సంస్థ అలాంటి స్మార్ట్ రింగునే అభివృద్ధి చేసింది. ఆ రింగు చేతి వెలికి ఉంటే చాలు.. డెబిట్, క్రెడిట్ కార్డులతో పనుండదు. దాంతోనే సులువుగా నగదు రహిత చెల్లింపు చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఉంగరం పేరు కూడా.. 'టాప్పీ'యే.

అమెరికాలోని లాస్ వెగాస్ లో జరుగుతున్న 'కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో'లో ఈ ఉంగరాన్ని ఆవిష్కరించారు. వైర్ లెస్ పేమెంట్ చిప్ లను కలిగి ఉండే ఈ రింగ్ స్మార్ట్ ఫోన్ యాప్ తో అనుసంధానమై పనిచేస్తుంది.

Married to money: 'smart' wedding ring doubles as payment method

సదరు యాప్ నుంచి బ్యాకు ఖాతాలకు అనుసంధానం చేసుకునే వీలుంటుంది. దీంతో ఏ స్టోర్ లోనైనా పేమెంట్ మిషన్ దగ్గర ఈ రింగును చూపించి సులువుగా చెల్లింపులు చేయవచ్చు. పైగా ఈ రింగ్ ను చార్జింగ్ చేయాల్సిన అవసరం కూడా లేకపోవడం విశేషం.

ఈ రింగ్ కు సంబంధించిన సాంకేతికతను జ్యుయలరీ కంపెనీలకు అందించనున్నట్లు దీనిని రూపొందించిన టాప్పీ సంస్థ వ్యవస్థాపకుడు, సిఇఒ లియాంగ్ పేర్కొన్నారు. వెండి, బంగారం.. రెండింటితోనూ ఈ స్మార్ట్ రింగ్ లను తయారు చేయవచ్చని వెల్లడించారు.

ఈ ఏడాది ఏప్రిల్ లో అమెరికా మార్కెట్ లోకి రానున్న ఈ 'టాప్పీ' రింగ్ ధర వంద డాలర్లు అంటే.. మన రూపాయల్లో సుమారు 6,800 వరకు ఉంటుందట.

English summary
Unveiled at CES 2017, Tappy ‘smart rings’ connect to wearer’s bank account and can be used to make purchases through contactless pay terminals in stores
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X