వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్కొక్క‌డు అయిదు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే..లేదంటే జైలుకే! అలా అన‌లేదంటోన్న ఆ దేశాధ్య‌క్షుడు

|
Google Oneindia TeluguNews

ఆఫ్రికా ఖండంలో ఓ చిన్న దేశం స్వాజిలాండ్‌. ఆ దేశం ఇప్పుడు ప్ర‌పంచవ్యాప్తంగా వార్త‌ల్లోకి ఎక్కింది. దీనికి కార‌ణం- ఆ దేశ అధ్య‌క్షుడు మెస్వాతి-3 జారీ చేసిన ఓ విచిత్ర‌మైన ఆదేశాలు. తమ దేశంలో పెళ్లీడు వచ్చిన ప్ర‌తి యువ‌కుడూ క‌నీసం అయిదు పెళ్లిళ్లు చేసుకోవాల‌ని ఆదేశించారు. ఈ ఆదేశాల‌ను పాటించ‌నివారికి యావ‌జ్జీవ కారాగార శిక్షి విధిస్తామ‌ని హెచ్చ‌రించారు.

అయిదు లేదా అంత‌కంటే పెళ్లిళ్లు చేసుకున్న వారికి ప్రోత్సాహ‌క బ‌హుమ‌తులు ఇస్తామ‌ని, ఒక్కో కుటుంబానికి ప్ర‌భుత్వ ఖ‌ర్చుతో ఇంటిని క‌ట్టిస్తామ‌నీ ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ ఆదేశాలు కాస్తా సంచ‌ల‌నం రేపాయి. దీన్ని ఆ దేశ ప్ర‌భుత్వం తోసిపుచ్చింది. అలాంటి ప్ర‌క‌ట‌న ఏదీ త‌మ దేశాధ్య‌క్షుడు చేయ‌లేద‌ని, విదేశీ మీడియా, సోష‌ల్ మీడియాలో ప్ర‌చురిత‌మైన ఆ క‌థ‌నాల‌న్నీ ఊహాజ‌నిత‌మైన‌వ‌ని, నిరాధార‌మైన‌వ‌ని అంటూ ఓ అధికార‌కి ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది ఆ దేశ ప్ర‌భుత్వం.

Marry 5 wives or be jailed, Swaziland King orders country men

పురుషుల కంటే మూడింతలు..

స్వాజిలాండ్ మొత్తం జ‌నాభా 14 ల‌క్ష‌ల 50 వేలు. ఇందులో మ‌హిళ‌ల సంఖ్య అత్య‌ధికం. ఎంత అధికం అంటే- పురుషుల‌తో పోల్చుకుంటే మూడింతలు ఎక్కువ‌. దీనితో చాలామంది యువ‌తుల‌కు పెళ్లిళ్లు కావ‌ట్లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని- ఒక్కో యువ‌కుడు క‌నీసం అయిదు మందిని లేదా అంతకంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవాలంటూ ఉత్త‌ర్వ‌లు జారీ చేసిన‌ట్లు వార్త‌లు వెలువ‌డ్డాయి.

సర్ అర్థర్ కాటన్ స్ఫూర్తితో పోలవరం పూర్తి: కృష్ణాడెల్టాలో 44 వేల కోట్ల పంట దిగుబ‌డి సర్ అర్థర్ కాటన్ స్ఫూర్తితో పోలవరం పూర్తి: కృష్ణాడెల్టాలో 44 వేల కోట్ల పంట దిగుబ‌డి

మెస్వాతి-3కి 15 మంది భార్య‌లు ఉన్నారు. 25 మంది వ‌ర‌కు సంతానం ఉంది. ఆయ‌న తండ్రికి 70 మంది భార్య‌లు, 150 మందికి పైగా సంతానం ఉంది. దేశంలో మ‌హిళ‌ల సంఖ్య అధికంగా ఉన్నందున స్వాజిలాండ్ దేశాధ్య‌క్షుడు ఇలాంటి క‌ఠినత‌ర‌మైన ఆదేశాల‌ను జారీ చేయాల్సి వ‌చ్చింద‌ని అంటూ ఆ దేశ అధికారుల‌ను ఉటంకిస్తూ కొన్ని అంత‌ర్జాతీయ వార్తా సంస్థ‌లు దీనికి సంబంధించిన క‌థ‌నాల‌ను ప్ర‌చురించాయి.

Marry 5 wives or be jailed, Swaziland King orders country men

తోసిపుచ్చిన ప్ర‌భుత్వం..

ఒక్కొక్క‌డు అయిదుమందిని వివాహం చేసుకోవాల్సిందేనంటూ ఆ దేశాధ్యక్షుడు మెస్వాతి-3 ఆదేశాలు జారీ చేసిన‌ట్లు వ‌చ్చిన వార్త‌ల‌ను ప్ర‌భుత్వ అధికారులు తోసిపుచ్చారు. ఈ వార్త‌లు నిరాధార‌మైన‌వ‌ని, త‌మ‌దేశ సాంస్కృతిక‌, జీవ‌న శైలిని చేటు క‌లిగించే ఎలాంటి ప్ర‌క‌టనా ఆయ‌న నుంచి అధికారికంగా వెలువ‌డ లేద‌ని స్వాజిలాండ్ ప్ర‌భుత్వ అధికార ప్ర‌తినిధి స్ప‌ష్టం చేశారు. దీనిపై ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

English summary
The King of Swaziland, King Mswati III has made a declaration in the country that from June 2019, men will be required to marry at least five wives or go to jail. A statement by the King called for all men in the country to marry at least five wives, assuring the men that government would pay for the marriage ceremonies and buy houses for them. “Here’s the deal, marry at least five wives and you’re assured that the government will pay for the marriage ceremonies and buy houses for them.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X