వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాసా మార్స్ స్పేస్‌క్రాఫ్ట్‌లో సమస్యలు: భూ ఛాయలోకి.. టెంపరేచర్ క్షీణించి: ప్రొటెక్టివ్ మోడ్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అంగారకుడిపై పరిశోధనలను కొనసాగించడానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా తాజాగా పంపించిన స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ సాంకేతిక సమస్యలు తీవ్రంగా పరిగణించదగ్గవి కావని నాసా పేర్కొంది. స్పేస్‌క్రాఫ్ట్‌లోని కొన్ని ముఖ్యమైన ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో ఈ సమస్యలు తలెత్తాయని వెల్లడించింది. మిగిలిన పరికరాలన్నీ సజావుగా పనిచేస్తున్నాయని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

భారత్‌పై చైనా అక్కసు: ఆర్థిక వేర్పాటువాదం: అతిపెద్ద ట్రేడ్ పార్ట్‌నర్: మాతో పెట్టుకుంటే:భారత్‌పై చైనా అక్కసు: ఆర్థిక వేర్పాటువాదం: అతిపెద్ద ట్రేడ్ పార్ట్‌నర్: మాతో పెట్టుకుంటే:

అంగారకుడిపై పరిశోధనలను నిర్వహించడానికి నాసా తాజాగా స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపించిన విషయం తెలిసిందే. నాసా కొత్తగా పంపించిన రోవర్ పర్సెవెరన్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి రెడ్ ప్లానెట్‌పై అడుగు పెడుతుంది. అంగారకుడిపై నీటి వనరులు, జీవజాలం నివసించడానికి అనువైన పరిస్థితులు, దాని ఉపరితల వాతావరణం వంటి పలు కీలక అంశాలకు సంబంధించిన డేటాను గ్రౌండ్ కంట్రోల్ రూమ్‌కు పంపిస్తుంది.

Mars 2020: NASAs Spaceship to Red Planet, experiencing technical issues

ఈ రోవర్ పర్సెవరెన్స్‌ను మోసుకెళ్లిన స్పేస్‌క్రాఫ్ట్‌లో తాజాగా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైనట్లు నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. అంగారక గ్రహం వైపు దూసుకెళ్తోన్న సమయంలో అనుకోకుండా భూమి నీడ ఈ స్పేస్‌క్రాఫ్ట్‌పై పడిందని, ఫలితంగా దాని టెంపరేచర్ క్షీణించిందని అన్నారు. ఈ స్పేస్‌క్రాఫ్ట్ తాము అంచనా వేసిన సమయం కంటే అధికంగా భూ ఛాయలో ప్రయాణించిందని పేర్కొన్నారు. ఫలితంగా స్పేస్‌క్రాఫ్ట్ టెంపరేచర్ అనూహ్యంగా తగ్గిందని తెలిపారు.

Recommended Video

China Mars Mission Tianwen-1 : China Launches First Mars Mission || Oneindia Telugu

భూ ఛాయ నుంచి బయటికి వెళ్లిన అనంతరం స్పేస్‌క్రాఫ్ట్ టెంపరేచర్ యాధాతథ స్థితికి చేరుకున్నట్లు తెలిపారు. భూ ఛాయలో ఉన్నంతసేపూ అందులోని కొన్ని పరికరాలు పని చేయడం మానేశాయని, ఫలితంగా సాంకేతిక సమస్యలు తలెత్తాయని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు. ఆ సమయంలో తాము స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రొటెక్టివ్ మోడ్‌లో ఉంచామని అన్నారు. భూమి నీడ నుంచి బయటికి వచ్చిన తరువాత మళ్లీ సాధారణ స్థితికి తీసుకొచ్చినట్లు వివరించారు.

English summary
Mars 2020, the spaceship carrying NASA’s new rover Perseverance to the Red Planet, is experiencing technical difficulties and is operating on important techniques solely, the company stated Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X