వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్స్ పైన మహా సముద్రం, ఆర్కిటిక్ కంటే పెద్దగా ఉండేది

By Srinivas
|
Google Oneindia TeluguNews

లండన్: మార్స్ గ్రహం పైన సముద్రం ఉందనేందుకు ఆధారాలు లభించాయని నాసా శాస్త్రవేత్తలు గురువారం నాడు చెప్పారు. ఆరేళ్ల పాటు మార్స్ గ్రహాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత చెబుతున్నామన్నారు. ఆన్సియెంట్ మార్స్ పైన నీరు ఉండేదని చెప్పారు.

ఈ సముద్రం పరిమాణం ఆర్కిటిక్ మహాసముద్రం అంత ఉండేదని చెప్పారు. అంతేకాకుండా, దీని పొడవు.. గతంలో అంచనా వేసిన దాని కంటే చాలా ఎక్కువే ఉండేదని చెప్పారు.

Mars Had an Ocean, Scientists Say, Pointing to New Data

ఆ నీళ్లు మార్స్ లోతట్టు ప్రాంతమైన నార్తర్న్ హెమీస్పియర్ పైన ఉండేదని చెప్పారు. అది మిలియన్ల సంవత్సరాలు ఉండిందని తెలిపారు. ఇది మరింత శోధించేందుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ప్లానెట్ చరిత్ర మరింత తెలుసుకోవచ్చునని చెప్పారు.

మార్స్ పైన నార్తర్న్ ఓసియన్ ఉన్న విషయమై దశాబ్దాలుగా చర్చ సాగుతోందని, అయితే, మొదటిసారి తాము కచ్చితంగా దానిని ఉన్నట్లుగా తెలుసుకున్నామని నాసా యొక్క గొడార్డ్ సెంటర్ ఫర్ ఆస్ట్రో బయోలజీ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ మైకేల్ ముమ్మా చెప్పారు.

English summary
After six years of planetary observations, scientists at NASA say they have found convincing new evidence that ancient Mars had an ocean.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X