వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Red Planet:ఆకాశంలో మరో అద్భుతం: భూమికి సమీపంలో అంగారకుడు, ఎలా ఎప్పుడు చూడాలి..?

|
Google Oneindia TeluguNews

ఆకాశంలో మరో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. అంగారక గ్రహం భూమికి అత్యంత సమీపంలోకి వచ్చి కనువిందు చేయనుంది. ఈ అద్భుతమైన దృశ్యం ఈ రోజు ఆకాశంలో కనిపించనుంది. వాతావరణం ఎలాగున్నా సరే ఈ సుందర దృశ్యాన్ని మాత్రం చూడటం మరువకూడదు. ఇక అంగారక గ్రహం భూమికి సమీపంలో మరో 15 ఏళ్ల పాటు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే 2035 వరకు అంగారక గ్రహం భూమికి సమీపంలోనే ఉంటుంది. అక్టోబర్ 6న భూమికి సమీపంలోకి రావడం ప్రారంభించిన అంగారకుడు... అక్టోబర్ 8తో మరింత సమీపంలోకి రానుంది. అయితే ఇది అర్థరాత్రిన జరగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 భూమికి దగ్గరలో అంగారక గ్రహం

భూమికి దగ్గరలో అంగారక గ్రహం

భూమికి అంగారక గ్రహం అత్యంత సమీపంలోకి వచ్చి అక్కడే 15 ఏళ్ల పాటు ఉంటుందని అమెరికాలోని ప్రముఖ అంతరిక్ష సంస్థ నాసా పేర్కొంది. భూమికి 38.6 మిలియన్ మైళ్ల దూరంలో అంగారక గ్రహం ఉంటుందని వెల్లడించింది. రాత్రి వేళల్లో ఎక్కువ సమయం అంగారకుడు కనిపిస్తుందని వెల్లడించిన నాసా... అర్థరాత్రి సమయానికల్లా అది గరిష్ట ఎత్తుకు వెళుతోందని వివరించింది. ఇక సూర్యుడి చుట్టూ ప్రదక్షిణలు చేసే సమయంలో భూమి, అంగారక గ్రహం ఒకదానికొకటి దూరం అవుతున్న క్రమంలో అంగారక గ్రహం కాస్త స్పష్టంగా కనిపించదని నాసా పేర్కొంది. అయితే అక్టోబర్ మాసం మొత్తం చాలా స్పష్టంగా కనిపిస్తుందని వెల్లడించింది.

 నాసా ఏం చెబుతోంది..?

నాసా ఏం చెబుతోంది..?

మార్స్‌ లేదా అంగారక గ్రహంను వీక్షించేందుకు అక్టోబర్ నెల సరైన సమయం అని నాసా స్పష్టం చేసింది. అయితే ఈ సారి ఓ ప్రత్యేకత కూడా ఉందని నాసా చెప్పింది. సూర్యుడి దగ్గర నుంచి భూమికి సరిగ్గా వ్యతిరేక దిశలో అంగారకుడు ఉంటాడని ఇలా రెండేళ్లకు ఓ సారి జరుగుతుందని పేర్కొంది. ఈ సమయంలోనే అంగారకుడు, భూమి కక్ష్యలు దగ్గరవుతాయని వెల్లడించింది. ఆ సమయంలోనే అంగారకుడు అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తుందని నాసా వివరించింది.

Recommended Video

NASA Launches Kalpana Chawla Cargo Spacecraft to Space Station అంతరిక్షంలో ముల్లంగి పెంపకం...!!
 అంగారక గ్రహంను ఎలా చూడాలి..?

అంగారక గ్రహంను ఎలా చూడాలి..?

ఇక మార్స్ గ్రహాన్ని చూసేందుకు బైనాక్యులర్ లేదా క్వాలిటీ ఉన్న కెమెరా ఫోన్‌ అయినా సరిపోతుందని నాసా చెబుతోంది. ఇక గతంలో భూమికి అంగారక గ్రహం 2018లో దగ్గరగా వచ్చింది. అంతకుముందు 2003లో అత్యంత సమీపంలోకి అంగారక గ్రహం వచ్చింది. 2003 ఆగష్టు 27న భూమికి అత్యంత దగ్గరగా అంగారక గ్రహం వచ్చింది. ఆ సమయంలో భూమినుంచి అంగారక గ్రహం దూరం 55,758,006 కిలోమీటర్ల దూరంలో ఉన్నింది. 60వేల సంవత్సరాల తర్వాత ఇలా అంగారక గ్రహం దగ్గరగా రావడం అదే తొలిసారి కావడం విశేషం. భూమి, అంగారక గ్రహాలు దగ్గరగా ఉన్నప్పుడు అంగారక గ్రహం అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఎలాంటి పరికరాలు వినియోగించకుండా నేరుగా కళ్లతోనే చూడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

English summary
If you spied a fiery red star close to the full moon over the weekend, it was actually Mars shining its bright red light in the night sky.The planet will be visible at night throughout October, rising the highest in the sky around midnight each evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X