వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

US: హైలాండ్ పార్క్ ఫోర్త్ జులై పరేడ్‌లో కాల్పుల బీభత్సం: పలువురు మృతి, మరికొందరికి గాయాలు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాలో కాల్పుల కల్చర్ కొనసాగుతోంది. తాజాగా, హైలాండ్ పార్క్ ఫోర్త్ ఆఫ్ జులై పెరేడ్ సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన 10 నిమిషాల తర్వాత.. గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఇండిపెండెన్స్ డే కవాతు-వెళ్లినవారు భయంతో పరుగులు పెట్టారు. వందలాది మంది ప్రాణాలు అరచేతిలో పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగెత్తారు. దీంతో అక్కడ వాతావరణం భయానకంగా మారింది.

పరేడ్‌లో పలువురిపై కాల్పులు జరిపారు దుండగులు. చికాగో సన్-టైమ్స్ రిపోర్టర్ కవాతు రివ్యూయింగ్ స్టాండ్‌కు సమీపంలో మూడు రక్తసిక్తమైన మృతదేహాలను కప్పి ఉంచడం, మరో ఐదుగురు వ్యక్తులు గాయపడి రక్తసిక్తమై ఉండటం చూసినట్లు పేర్కొన్నారు. కాగా, ఈ కాల్పుల్లో ఐదుగురు మృతి చెంగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.

Mass shooting at Highland Park 4th of July parade, multiple people shot in illinois

కాల్పుల్లో గాయపడినవారిని హుటాహుటిన ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కాగా, చాలా మంది సాక్షులు అనేక కాల్పులు విన్నట్లు చెప్పారు. నిందితుడు 20 రౌండ్లకుపైగా కాల్పులు జరిపాడని ఒక సాక్షి చెప్పాడు.

హైలాండ్ పార్క్ నివాసి మైల్స్ జారెమ్‌స్కీ సన్-టైమ్స్‌తో మాట్లాడుతూ.. "నేను 20 నుంచి 25 షాట్‌లను విన్నాను, అవి వేగంగా ఉన్నాయి. కనుక ఇది కేవలం చేతి తుపాకీ లేదా షాట్‌గన్ కాదు' అని తెలిపాడు.

డౌన్‌టౌన్ హైలాండ్ పార్క్‌లోని సెకండ్ అవెన్యూ చుట్టూ సెంట్రల్ అవెన్యూ వద్ద కాల్పుల తర్వాత.. "ఆ ప్రాంతంలో కాల్చి చంపబడిన వ్యక్తులను" చూశానని, "ఒక మహిళ రక్తంతో కప్పబడిందని" జారెమ్స్కీ చెప్పాడు. ఈ క్రమంలో ప్రజలంతా ఇక్కడ్నుంచి సురక్షిత ప్రాంతాలకు వెంటనే తరలిపోవాలని పోలీసులు సూచించారు.

English summary
Mass shooting at Highland Park 4rth of July parade, multiple people shot in illinois.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X