వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో కాల్పులు: 10మంది మృతి(వీడియో)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. న్యూ అర్లియన్స్ ప్రాంతంలోని ఓ పార్కులో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో కనీసం 10 మంది మంది మృతి చెందగా, 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళితే అమెరికాలోని న్యూ అర్లియన్స్ ప్రాంతంలో ఉన్న 'బన్నీ ప్రెండ్ పార్కు' సందడిగా ఉంది. రాత్రి 7 కావస్తున్నా చిన్నారులు, యవకులు ఆడుకుంటూనే ఉన్నారు. వృద్ధులు పార్కులో ఉన్న బెంచీల మీద కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు.

ఇలా సుమారు 500 మందితో ఉన్న పార్కులోకి తుపాకులు చేతబట్టిన ఇద్దరు దుండగులు ప్రవేశించారు. పార్టు గేట్ నుంచి లోపలికి ప్రవేశిస్తూనే కొంతమందిని టార్గెట్ చేసుకుని విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. భారత కాలమానం ప్రకారం ఈ సంఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది.

ఈ ఘటనలో ఇప్పటి వరకు 10 మంది చనిపోగా, 16 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే కాల్పులు జరిపిన వారెవరన్నది ఇంకా తెలియరాలేదు. ఈ కాల్పుల ఘటన వెనుక ఉగ్రవాదుల ప్రమేయం లేదని, రెండు గ్యాంగుల మధ్య తలెత్తిన విబేధాలే కారణమని పోలీసులు చెబుతున్నారు.

ఇటీవలే పారిస్, మాలి రాజధాని బొమాకోలో ఉగ్రవాదుల దాడుల తర్వాత అమెరికాలో చోటుచేసుకున్న ఈ కాల్పులపై ప్రపంచ దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

English summary
At least sixteen people have been taken to hospital after a mass shooting at a playground in New Orleans, according to US reports. It is understood that about 500 people were at the "Bunny Friend" park at the time of the attack, as a music video was being filmed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X