వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిలిప్పైన్స్‌లో భారీ భూకంపం: 73 మంది మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

మనీలా: పిలిప్పైన్స్‌ను మంగళవారం భారీ భూకంపం వణికించింది. మధ్య పిలిప్పైన్స్‌లో ఈ భూకంపం రెక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. ఇందులో 73 మంది మరణించారు. భూకంపం తాకిడికి భవనాలు కూలిపోయాయి. చర్చిలు నేలకూలాయి. భయాందోళనలతో ప్రజలు పరుగులు తీయడంతో తొక్కిసలాటలు చోటు చేసుకున్నాయి.

భూకంపం తాకిడికి బోహోల్‌ దీవిలో 57 మంది మృత్యువాత పడ్డారు. దాని పరిసరాల్లో గల సిబూ, సిక్వాజోర్‌ దీవుల్లో 16 మంది మరణించినట్లు జాతీయ విపత్తుల సంస్థ ప్రకటించింది. భవనాలు, చర్చిలు కూలి పడడంతో రోడ్లు మూసుకుపోయాయి.

Philippines earthquake

మంగళవారం ఉదయం 8 గంటల 12 నిమిషాలకు భూకంపం పిలిప్పైన్స్ ప్రజలను భీతావహులను చేసింది. సిబూలో పెద్ద యెత్తున విధ్వంసం జరిగింది. బోహోల్ దీవిలో చాలా భవనాలు కూలిపోయాయి. రోడ్లు బీటలు వారాయి. వంతెనలు కూలిపోయాయి.

భవనం నుంచి తాము బయటకు పరుగులు తీశామని, అయితే తమకు అడ్డంగా చెట్లు కూలిపడ్డాయని బోహోల్‌లోని ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ఉద్యోగి చెప్పారు. కార్యాలయాలను, విద్యాసంస్థలను మూసేశారు. జాతీయ సెలవు దినంగా ప్రకటించారు.

English summary
Several people were reported dead as a 7.2-magnitude earthquake struct across the central Philippines on Tuesday, toppling buildings and historic churches and sending terrified residents into deadly stampedes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X