వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీరూట్‌లో భారీ పేలుళ్లు: 27 మంది మృతి, అనేక మందికి గాయాలు, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం

|
Google Oneindia TeluguNews

బీరూట్: లెబనాన్ రాజధాని బీరూట్‌లో మంగళవారం భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో అనేక మంది గాయాలపాలయ్యారు. పలువురు మృతి చెందారు. భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. రాజధానిలో సంభవించిన భారీ పేలుళ్లతో పలు ప్రాంతాలు కదిలిపోయాయి.

Recommended Video

Lebanon : పేలుడు తో ఎలాంటి సంబంధం లేదన్న Israel | అమ్మోనియం నైట్రేట్ వల్లే నా? || Oneindia Telugu

రాజధాని నగరమంతా ఈ భారీ పేలుడుతో పొగ వ్యాపించింది. అనేక భవనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. బీరూట్ పోర్టు సమీపంలో ఈ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనతో భారీ విధ్వంసమే జరిగింది.

సెంట్రల్ బీరూట్‌లో ఈ పేలుడు కారణంగా వందలాది మంది గాయాలపాలయ్యారు. సమాచారం అందుున్న సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి.. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించాయి.

Massive explosion rocks Beirut, no casualties reported

పేలుళ్లతో భారీ స్థాయిలో ఆస్తి నష్టం సంభవించిందని అధికారులు చెప్పారు. పోర్టులో ఉంచిన బాణాసంచా, పేలుడు పదార్థాల కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. కాగా, ఈ పేలుడుతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.

భారీ పేలుడు పదార్థాల వల్లే.. 27 మంది మృతి

లెబనాన్ జనరల్ సెక్యూరిట్ హెడ్ జనరల్ అబ్బాస్ ఇబ్రహీం పేలుడు ఘటనా ప్రాంతాన్ని సందర్శించారు. గిడ్డండిలో భారీ పేలుడు పదార్థాలను నిల్వ చేయడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ పేలుడు పదార్థాలు ఇక్కడేవుంటున్నాయని చెప్పారు. వందలాది మంది గాయాలపాలయ్యారని, ఇప్పటి వరకు 27 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు.

English summary
A massive explosion shook Lebanon's capital Beirut on Tuesday wounding a number people and causing widespread damage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X