వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షార్జా రెసిడెన్షియల్ టవర్‌లో భారీ అగ్నిప్రమాదం.. అందులో ఎక్కువమంది ఇండియన్సే..

|
Google Oneindia TeluguNews

సౌదీలోని షార్జా నగరంలో ఉన్నఅల్ నహ్‌దా ప్రాంతంలో మంగళవారం(మే 5) ఓ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తు ప్రాణ నష్టం సంభవించనప్పటికీ.. ఐదుగురు
వ్యక్తులు గాయపడ్డట్టు సమాచారం. ఇందులో నివాసం ఉంటున్నవారిలో ఎక్కువమంది భారతీయులే కావడం గమనార్హం.

అబ్కో టవర్ అని పిలువబడే ఆ రెసిడెన్షియల్ టవర్ 47 అంతస్తుల్లో ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అధికారులు అందులో నివాసం ఉంటున్నవారిని,చుట్టుపక్కలవారినీ ఖాళీ చేయించారు. ఖలీజ్ టైమ్స్ కథనం ప్రకారం.. ఆ రెసిడెన్షియల్ టవర్ పక్కనే ఉన్న తాజ్ బెంగళూరు రెస్టారెంట్‌లో మొదట మంటలు చెలరేగాయి. ఆ తర్వాత అబ్కో టవర్‌కు కూడా మంటలు వ్యాపించాయి.

Massive fire engulfs building in UAEs Sharjah no casualties reported

Recommended Video

Lockdown : India Plans To Bring Back Over 14,000 Stranded Indians In 64 flights | Oneindia Telugu

రాత్రి 9గంటల సమయంలో అగ్ని ప్రమాద సమాచారం అందగానే మినా ఫైర్ స్టేషన్,అల్ నహ్‌దా ఫైర్ స్టేషన్ల నుంచి సివిల్ డిఫెన్స్ సిబ్బంది అక్కడికి పరిగెత్తారు. ఎట్టకేలకు మంటలను అదుపు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాదానికి కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అధికారులు ప్రస్తుతం దానిపై విచారణ జరుపుతున్నారు.

English summary
At least five people were injured after a huge fire broke out at a residential tower in UAE's Sharjah on Tuesday night. So far, no casualties have been reported and the firefighters have managed to bring it under control.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X