వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇజ్రాయెల్-భారత్ మధ్య 7 కీలక ఒప్పందాలు, ఇవే

భారత్ - ఇజ్రాయెల్ మధ్య బుధవారం 7 ఒప్పందాలు కుదిరాయి. ఉభయ దేశాల ప్రధానమంత్రులు నరేంద్ర మోడీ, బెంజిమిన్ నేతన్యాహూల సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్ - ఇజ్రాయెల్ మధ్య బుధవారం 7 ఒప్పందాలు కుదిరాయి. ఉభయ దేశాల ప్రధానమంత్రులు నరేంద్ర మోడీ, బెంజిమిన్ నేతన్యాహూల సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారు. నేతన్యాహుతో ప్రయోజనకర చర్చలు జరిగాయన్నారు. ద్వైపాక్షిక అవకాశాలపై మాత్రమే కాకుండా శాంతి, సుస్థిరత బలపడేందుకు ఇరు దేశాల సహకారం ఎలా దోహదపడుతుందనే అంశంపై చర్చించామన్నారు.

'Match made in heaven,' says Netanyahu as India-Israel sign 7 pacts

భారత్, ఇజ్రాయెల్ సంక్లిష్ట భౌగోళిక పరిస్థితుల్లో ఉన్నాయన్నారు. ఉగ్రవాదం వ్యాపింపజేస్తున్న హింస, విద్వేషాల వల్ల భారతదేశం తీవ్రంగా నష్టపోతోందన్నారు. ఇజ్రాయెల్ పరిస్థితీ అదే అన్నారు. నేతన్యూహూను కుటుంబసమేతంగా భారత్ ఆహ్వానించారు. దానికి ఆయన అంగీకరించారు.

ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు ఇజ్రాయెల్ సహకరిస్తుందని చెప్పారు. ఇరు దేశాలు చరిత్ర సృష్టిస్తున్నాయన్నారు. ఈ పెళ్ళిని స్వర్గంలో నిర్ణయించారని, దానిని ఇప్పుడు మనం భూమి మీద అమలు చేస్తున్నామన్నారు. వివిధ రంగాల్లో దృఢమైన ప్రణాళికలు మనల్ని దగ్గర చేయడానికి జనవరి 1 నాటికి దీనిని అమలు చేస్తున్నామన్నారు.

కుదిరిన ఏడు ఒప్పందాలు

- ఇండియా - ఇజ్రాయెల్ పారిశ్రామిక పరిశోధన, అభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణల నిధి ఏర్పాటు
- భారత దేశంలో జల సంరక్షణ
- భారత దేశంలో జల వినియోగ సంస్కరణలు
- భారత్ - ఇజ్రాయెల్ అభివృద్ధి సహకారం. 2018-2020 మధ్య మూడేళ్ల పాటు వ్యవసాయ రంగంలో కృషి.
- అటామిక్ క్లాక్స్‌లో సహకారానికి సంబంధించిన ప్రణాళిక
- జీఈఓ - ఎల్ఈవో ఆప్టికల్ లింక్‌లో సహకారం.
చిన్న ఉపగ్రహాల కోసం ఎలక్టిర్క్ ప్రొపల్షన్‌లో సహకారం.

English summary
After calling India and Israel "sister democracies" yesterday, PM Benjamin Netanyahu today described the burgeoning cooperation between the two countries as a match made in heaven.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X