వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిడెన్ గెలిస్తే నేను దేశం విడిచి వెళ్లాల్సిందే.. అప్పుడే ట్రంప్ నైరాశ్యం..?

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం మంచి ఊపు మీదుంది. అధ్యక్ష అభ్యర్థులు ట్రంప్, బిడెన్ మధ్య వాడీ వేడీ చర్చ జరుగుతోంది. అయితే కరోనా వైరస్, ఆర్థిక మాంద్యం, జాత్యాంహకారం దాడుల నేపథ్యంలో.. బిడెన్ ప్రసంగాల్లో పట్టు సాధించినట్టే కనిపిస్తోంది. అయితే ట్రంప్ కూడా అమెరికా.. అమెరికన్ల కోసం అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే తాజాగా బిడెన్ గెలిస్తే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

maybe-i-ll-have-to-leave-the-country-if-biden-wins-trump

శుక్రవారం జార్జియా ర్యాలీలో ట్రంప్ ప్రసంగించారు. రెండుగంటల పాటు వివిధ అంశాలపై మాట్లాడారు. స్నేహపూర్వక వాణిజ్యం అంటూ ప్రసంగం సాగింది. అంతేకాదు తనకు వైరస్ సోకిందని ప్రత్యర్థులు ఆనందపడ్డారని తెలిపారు. అంతేకాదు తాను ఎన్నికల్లో ఓడిపోతే దేశం విడిచి వెళ్లిపోవాలని బెదిరిస్తారని కూడా ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే ఏం జరుగుతుందో మీరు ఊహించగలరా అన్నారు. నిజంగానే ఓడిపోతే దేశం విడిచి వెళ్లాల్సి వస్తుందని ఆందోళన చెందారు.

ఎన్నికల ప్రచారంలో ట్రంప్ కాస్త వెనకబడి అనిపిస్తోంది. ఎక్కువ డబ్బులు సమీకరించగలనని ట్రంప్ చెబుతున్నారు. ఈ వారం ట్రంప్ ప్రచారం ద్వారా 247 మిలియన్ డాలర్లు సమీకరించారు. బిడెన్ మాత్రం 383 మిలియన్ డాలర్లను సేకరించి.. ముందు వరసలో నిలిచారు.

ఇటీవల జరిగిన డిబెట్‌లో కూడా ఇద్దరి మధ్య పోటా పోటీ చర్చ జరిగింది. నువ్వా నేనా అన్నట్టు వివిధ అంశాలపై ఇరువురు మాట్లాడారు. ఇటు ఉపాధ్యక్ష అభ్యర్థులు కమలా హ్యరిస్ మైక్ పెన్స్ మధ్య కూడా హాట్ హాట్ డిస్కషన్ సాగింది.

English summary
President Donald Trump focused on his reelection campaign, recasting some of his failures as a candidate as active choices during a rally Friday evening in Macon, Georgia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X