వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రేట్: 13 ఏళ్లకే ప్రోగ్రామింగ్, కోడింగ్ లో ఆరితేరి.. ఏకంగా కంపెనీ పెట్టేసింది

ఐటీ ఇండస్ట్రీలో కంప్యూటర్ ప్రోగ్రామింగ్, కోడింగ్ లే ముఖ్యం. ఫిలిప్పీన్స్ లోని యాంటీపోలో నగరానికి చెందిన ఇసబెల్ సియా వీటిని అవలీలగా నేర్చుకుని.. 13 ఏళ్లకే ఐటీ కంపెనీ పెట్టేసింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ఐటీ ఇండస్ట్రీలో కంప్యూటర్ ప్రోగ్రామింగ్, కోడింగ్ లే ముఖ్యం. ఫిలిప్పీన్స్ లోని యాంటీపోలో నగరానికి చెందిన ఇసబెల్ సియా వీటిని అవలీలగా నేర్చుకుని.. 13 ఏళ్లకే ఐటీ కంపెనీ పెట్టేసింది. ఇసబెల్ పదేళ్ల వయసు నుంచే కంప్యూటర్ కోడింగ్ నేర్చకోవడం మొదలుపెట్టంది.

తను గణింతో బాగా రాణిస్తుండడంతో ఆమె టీచర్ ఆమెను కంప్యూటర్ కోడింగ్ నేర్చుకోమని ప్రోత్సహించిందట. దీంతో ఇసబెల్ హెచ్ టిఎంఎల్, జావా స్క్రిప్ట్ లను ఆన్ లైన్ కోర్సుల ద్వారా నేర్చుకుంది.

Meet the 13-Year-Old Filipino Programmer Who Built Her Own Company

ఇసబెల్ ఆసక్తి గమనించిన ఆమె తల్లి ప్రత్యేకంగా ట్యూషన్ పెట్టించి మరీ ప్రోత్సహించిందట. అలా 13 ఏళ్లకే కోడింగ్, ప్రోగ్రామింగ్ లో ఆరితేరిన ఇసబెల్ 'గర్ల్ విల్ కోడ్' పేరుతో కంపెనీ ప్రారంభించింది.

అయితే ఈ ఐటీ కంపెనీ డబ్బు సంపాదించడానికి పెట్టింది కాదు. తన మాదిరిగానే చిన్నతనంలోనే ఐటీపై ఆసక్తి కనబరిచే అమ్మాయిలకు చేయూతనిస్తూ.. వారికి ఐటీ కోర్సుల్లో తర్ఫీదు ఇస్తోంది.

అంతేకాకుండా పాఠశాలల్లో తరగతులు పూర్తయ్యాక అదనంగా ఈ కోడింగ్ కోర్సును బోధించేలా ఈ కంపెనీ ప్రోత్సహిస్తోంది. వారితో ఆకట్టుకునే కథలు, గేమ్స్ రూపొందిస్తోంది. కోడింగ్ గురించి ఇసబెల్ మాట్లాడుతూ.. 'ఇది ఒక భాష లాంటిదే, ఎంత త్వరగా నేర్చుకుంటే అంత త్వరగా అనర్గళంగా మారిపోతుంటుంది..' అని వ్యాఖ్యానించింది.

English summary
While many 10-year-old kids are busy playing outside, one young girl from the Philippines got busy learning something very different. Isabel Sieh, from Antipolo City, Philippines, was just 10-year-old when she began learning how to code — a skill that has made many people millionaires and billionaires. According to Gineers Now, the youngster who is now 13 was first introduced to coding three years ago. She said that her teacher noticed that she excelled in math and suggested that she start learning how to code.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X