వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వయస్సు 89 ఏళ్లు... 10 వేల సర్జరీలు! డాక్టర్ బామ్మ.. ది గ్రేట్!!

రష్యా రాజధాని మాస్కోలోని ర్యాజన్ సిటీ హాస్పిటల్ లో డాక్టర్ గా పని చేస్తోన్న అల్లా ఇలియినిచ్నా లెవుష్కినా 89 ఏళ్ల వయస్సులో కూడా రోజుకు 4 సర్జరీలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

మాస్కో: వయస్సు కేవలం శరీరానికే కాని మనసుకు కాదు.. ఉత్సాహం ఉండాలేకానీ వయస్సు ఎంత ఉన్నా.. ఎవరైనా.. ఏ పనైనా చేయొచ్చని నిరూపిస్తోంది ఓ బామ్మ. ఈమె వయస్సు 89 సంవత్సరాలు. చేస్తుంది వైద్య వృత్తి.

ఇది కాదు అసలు సంగతి. ఈ వయస్సులోనూ ఈ డాక్టర్ బామ్మ ఎడాపెడా సర్జరీలు చేసిపారేస్తోంది. 1950లలో డాక్టర్ గా తన కెరీర్ మొదలెట్టిన ఆమె ఇప్పటివరకు తన 67 ఏళ్ల వైద్య వృత్తిలో దాదాపు 10 వేల సర్జరీలు చేసింది. ఇందులో ఏ సర్జరీ కూడా ఫెయిలవకపోవడం విశేషం.

Meet The World’s Oldest Surgeon Who Is 89 Years Old And Still Performs 4 Operations A Day

రష్యా రాజధాని మాస్కోలోని ర్యాజన్ సిటీ హాస్పిటల్ లో డాక్టర్ గా పని చేస్తోన్న అల్లా ఇలియినిచ్నా లెవుష్కినా 89 ఏళ్ల వయస్సులో కూడా రోజుకు 4 సర్జరీలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఈమె ఇప్పటి వరకు వివాహం కూడా చేసుకోలేదు. తన మేనల్లుడితో కలిసి నివసిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయస్సు గల వర్కింగ్ సర్జన్ గా కూడా రికార్డు సృష్టించిన లెవుష్కినాను సర్జన్ గా ఆమె విజయ పరంపరపై ప్రశ్నిస్తే... తాను జీవించి ఉన్నంత కాలం సర్జరీలు చేస్తూనే ఉంటానని, చికిత్స చేసి మనిషికి ప్రాణం పోయడం కన్నా మించిన పని ఏముంటుందని బదులిస్తోంది.

English summary
If you think that age slows you down then you’ve obviously never met Alla Illyinichna Levushkina. She’s a surgeon at Ryazan City Hospital near Moscow, and despite being almost 90 – yes, you heard that correctly – she still performs 4 operations every day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X