వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెహుల్ చోక్సిని విచారించేందుకు ఆంట్విగా సర్కార్ ఓకే..

|
Google Oneindia TeluguNews

పంజాబ్ నేషనల్ బ్యాంకు కన్షార్షియానికి రూ.14 వేల కుచ్చుటోపి పెట్టి విదేశాలకు పారిపోయిన మొహుల్ చోక్సీని విచారించేందుకు ఆంట్విగా ప్రభుత్వం అంగీకరించింది. చోక్సికి నిజాయితీ లేదని, అతనిని విచారించేందుకు అనుమతి ఇస్తున్నామని ప్రధాని గాస్టన్ బ్రౌన్ పేర్కొన్నారు. భారత దర్యాప్తు సంస్థలు ఆంట్విగా వచ్చి స్వేచ్చగా చోక్సిని విచారించొచ్చని తెలిపారు.

మెహుల్ చోక్సికి నీతి, నిజాయితీ లేదని పేర్కొన్నారు. అతనిని ఇండియా కూడా తీసుకెళ్లి విచారించొచ్చని తెలిపారు. ఇందు కోసం న్యాయ ప్రక్రియను పూర్తి చేసేందుకు తాము సమ్మతిస్తామని చెప్పారు. పంజాబ్ నేషనల్ స్కాం బయటపడే కొద్దిరోజుల ముందు చోక్సి ఆంట్విగా చేరుకున్నారు. ఆ దేశ పౌరసత్వం తీసుకున్నారు. ఆంట్విగా పౌరసత్వం తీసుకున్నందున అతనిని విచారించేందుకు దర్యాప్తు సంస్థలకు అక్కడి చట్టాలు అడ్డొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆంట్విగా ప్రధాని స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Mehul Choksi a crook, India free to interrogate him: Antigua PM

చోక్సి అల్లుడు నీరవ్ మోడీ పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితుడు. పంజాబ్ నేషనల్ బ్యాంకు కన్సార్షియాన్ని ముంచి రూ.14 వేల కోట్లకు కుచ్చుటోపి పెట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు కారికామ్‌లో గాస్టన్ బ్రౌన్ ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కేవలం వాణిజ్య, పెట్టుబడుల గురించి మాత్రమే ప్రస్తావిస్తామని పేర్కొన్నారు. భారతదేశంతో తమ వర్తక వాణిజ్యం కొనసాగుతుందని .. మునుపటిలాగే సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.

English summary
Antigua & Barbuda Prime Minister Gaston Browne has called Mehul Choksi, one of the accused in the Rs 14,000 crore Punjab National Bank scam, a "crook". Indian investigators are free to come and interrogate the fugitive businessman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X