• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆర్థిక నేరగాడు చోక్సీ భారత్‌కు అప్పగింత?: డొమినాకాలో దిగిన జెట్: ఆంటిగ్వా ప్రధాని కన్‌ఫర్మ్

|

ముంబై: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల మేర మోసగించి, దేశం వదిలి పారిపోయిన ఆర్థిక నేరస్తుడు మేహుల్ చోక్సీ కనిపించకుండా పోయిన ఉదంతం అనేక మలుపులు తిరుగుతోంది. రోజుకో కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొస్తోంది. ఆంటిగ్వా అండ్ బార్బుడాలో కొద్దిరోజుల కిందట అదృశ్యమైన ఆయన పొరుగు దేశం డొమినికాలో తేలడం, ఆ తరువాత పోలీసుల కస్టడీలో ఉండటం వంటి పరిణామాలు శరవేగంగా చోటు చేసుకున్నాయి. అదే క్రమంలో- ఇక ఆయన భారత్‌కు రప్పించే ప్రక్రియ కూడా ముమ్మరమైంది. దీనికోసం భారత్ నుంచి ఓ ప్రత్యేక ప్రైవేట్ జెట్ డొమినాకాలోని ఛార్లెస్ డగ్లస్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.

ఆంటిగ్వా పౌరసత్వంతో..

ఆంటిగ్వా పౌరసత్వంతో..

మేహుల్ చోక్సీ, ఆయన కుటుంబ సభ్యులు ప్రస్తుతం ద్వీపదేశం ఆంటిగ్వా అండ్ బార్బడోస్‌లో నివసిస్తోన్నారు. వారికి ఆ దేశ పౌరసత్వం ఉంది. అంటిగ్వా పశ్చిమ తీర ప్రాంతంలోని రిసార్ట్ విలేజ్ జాలీ హార్బర్‌లో ఉన్న ఓ రెస్టారెంట్‌లో భోజనం చేయడానికంటూ ఈ నెల 24వ తేదీన ఇంటి నుంచి తన కారులో బయలుదేరిన చోక్సీ.. ఇక మళ్లీ తిరిగి రాలేదు. ఆయన మొబైల్ స్విచాఫ్ అయింది. గంటలు గడుస్తున్నప్పటికీ ఆచూకీ తెలియరాలేదు. మిస్సింగ్ కింద కేసు నమోదు చేసుకున్నపోలీసులు ఆయన కోసం పెద్ద ఎత్తున గాలించారు. చివరికి ఆయన డొమినికాలో ఉన్నట్లు నిర్ధానించారు.

తొలుత క్యూబా.. ఆ తరువాత డొమినికా..

తొలుత క్యూబా.. ఆ తరువాత డొమినికా..

భారత్‌కు అప్పగించే ప్రక్రియను ఆంటిగ్వా ప్రభుత్వం ముమ్మరం చేసినందు వల్ల మేహుల్ చోక్సీ ఉద్దేశపూరకంగా అక్కడి నుంచి పారిపోయి ఉంటాడంటూ మొదట్లో వార్తలొచ్చాయి. జాలీ హార్బర్ నుంచి తొలుత క్యూబా పారిపోయి ఉండొచ్చని భావించినా.. అది అవాస్తవమని తేలింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను అపహరించారని, బలవంతంగా డొమినికాకు తీసుకెళ్లినట్లు స్పష్టమైంది.

మేహుల్ చోక్సీని తమ దేశానికి పంపించ వద్దని, నేరుగా భారత్‌కు అప్పగించాలంటూ అంటిగ్వా అండ్ బార్బుడా ప్రధానమంత్రి గ్యాస్టన్ బ్రౌనె డొమినికా ప్రధానికి విజ్ఞప్తి చేయడం అనూహ్య పరిణామం. దీనిపై చోక్సీ తరఫు న్యాయవాది ఈస్టర్న్ కరేబియన్ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

డొమినికాలో దిగిన బొంబార్డియర్

డొమినికాలో దిగిన బొంబార్డియర్

ఈ నేపథ్యంలో ఖతర్‌కు చెందిన బొంబార్డియర్ 5000 ఎయిర్‌క్రాఫ్ట్ ఒకటి డొమినికాలోని ఛార్లెస్ డగ్లస్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మేహుల్ చోక్సీని భారత్‌కు తీసుకెళ్లడానికే ఈ ఏర్పాట్లు చేసినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రైవేట్ జెట్ భారత్ నుంచే వచ్చినట్లు ఆంటిగ్వా ప్రధాని బ్రౌనే ధృవీకరించారు. ఈ జెట్ భారత్ నుంచి వచ్చినట్లు నిర్ధారించారు. చోక్సీని నేరుగా భారత్‌కు అప్పగించాలంటూ ఆయన మరోసారి డొమినికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రెండు దేశాల మధ్య సాధారణంగా ఉండే ఇచ్చిపుచ్చకునే ధోరణి, పరస్పర సహకారాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ఆయన సూచించారు.

  #TopNews : Chandrababu ప్లాన్ విఫలం | Pandem Kodi తరహా లో Rapo 19 || Oneindia Telugu
  ఆంటిగ్వాకు వస్తే..

  ఆంటిగ్వాకు వస్తే..

  అలా కాదని, చోక్సీని మళ్లీ ఆంటిగ్వాకు పంపిస్తే.. అతను ఎప్పట్లాగే సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడని ప్రధాని స్పష్టం చేశారు. తమ దేశ పౌరులకు చట్టాలు, రాజ్యాంగం కల్పించిన రక్షణను ఉపయోగించుకుంటాడని పేర్కొన్నారు. చోక్సీకి ఆంటిగ్వా అండ్ బార్బుడా పౌరసత్వం ఉందన్న విషయాన్ని పరోక్షంగా గుర్తు చేశారు. అందుేక- నేరుగా చోక్సీని భారత్‌కు అప్పగించాలని డొమినికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

  English summary
  Efforts have been scaled up to bring back fugitive businessman Mehul Choksi. Government of Dominica on the issue which has been told that Choksi is originally an Indian citizen and had taken on new citizenship to escape the law in India
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X