• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Mehul Choksiతో రిలేషన్‌‌పై గర్ల్‌ఫ్రెండ్: హోటల్‌లో రూమ్ బుక్ చేసేవాడు: డిన్నర్..దానికి నో ఛాన్స్

|

ముంబై: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల మేర మోసగించి, దేశం వదిలి పారిపోయిన ఆర్థిక నేరస్తుడు మేహుల్ చోక్సీ కనిపించకుండా పోయిన ఉదంతం.. అటు తిరిగి, ఇటు తిరిగి చివరికి డొమినికా జైలులో తేలింది. రోజులు గడిచే కొద్దీ ఈ ఎపిసోడ్‌లో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తోన్నాయి. ఆంటిగ్వా అండ్ బార్బుడాలో కొద్దిరోజుల కిందట అదృశ్యమైన ఆయన పొరుగు దేశం డొమినికాలో తేలడం, ఆ తరువాత పోలీసుల కస్టడీలో ఉండటం వంటి పరిణామాలు శరవేగంగా చోటు చేసుకుంటోన్నాయి. చోక్సీని భారత్‌కు అప్పగించడానికి ఆంటిగ్వా ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నప్పటికీ.. డొమినికా జైలులో ఉండటం వల్ల కుదరట్లేదు.

నో కాంప్రమైజ్: విజయవాడలో నూటొక్కటి..హైదరాబాద్‌లో నూటికి: అక్కడ రూ.106 క్రాస్: జనం గగ్గోలునో కాంప్రమైజ్: విజయవాడలో నూటొక్కటి..హైదరాబాద్‌లో నూటికి: అక్కడ రూ.106 క్రాస్: జనం గగ్గోలు

అక్రమంగా ప్రవేశించాడంటూ..

అక్రమంగా ప్రవేశించాడంటూ..

ఆంటిగ్వా అండ్ బార్బుడాలోని విలాసవంతమైన ప్రదేశం జాలీ హార్బర్ నుంచి కనిపించకుండా పోయిన మేహుల్ చోక్సీ.. డొమినికాలో ఒంటి మీద గాయాలతో ప్రత్యక్షం అయ్యారు. అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించాడనే కారణంతో డొమినికా ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన జైలులో ఉంటోన్నారు. చోక్సీని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ ఆయన తరఫు న్యాయవాది డొమినికా పోలీసులకు ఫిర్యాదు చేయడం, భారత్‌కు అప్పగించే ప్రయత్నాలను సవాల్ చేస్తూ ఈస్టర్న్ కరేబియన్ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయడం మరో ట్విస్ట్.

 తొలిసారిగా నోరు విప్పిన చోక్సీ గర్ల్‌ఫ్రెండ్

తొలిసారిగా నోరు విప్పిన చోక్సీ గర్ల్‌ఫ్రెండ్

మేహుల్ చోక్సీ.. తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి డొమినాకాకు రొమాంటిక్ ట్రిప్ కోసం వెళ్లాడంటూ ఆంటిగ్వా ప్రధానమంత్రి బ్రౌనే చేసిన ప్రకటనతో అతని కిడ్నాప్ వ్యవహారం మొత్తం మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పటిదాకా వెలుగులోకి రాని చోక్సీ గర్ల్‌ఫ్రెండ్ బార్బారా జబారికా.. తొలిసారిగా నోరు విప్పారు. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక వెబ్‌సైట్ ఇండియా టుడే, వార్తా సంస్థ ఎఎన్‌ఐకి వేర్వేరుగా ఇంటర్వ్యూ ఇచ్చారు. అనేక విషయాలను ప్రస్తావించారు. మేహుల్ చోక్సీతో తనకు ఉన్న రిలేషన్‌‌షిప్‌పై క్లారిటీ ఇచ్చారు.

 ఫ్రెండ్ మాత్రమే..

ఫ్రెండ్ మాత్రమే..

మేహుల్ చోక్సీతో ఫ్రెండ్‌షిప్ మాత్రమే ఉందని బార్బారా జబారికా స్పష్టం చేశారు. తాను ఆంటిగ్వాకు రావాలనుకున్నప్పుడు ఫ్లైట్ టికెట్లు, ఉండటానికి హోటల్‌‌లో రూమ్‌‌ను బుక్ చేసేవాడని, దాన్ని తాను తిరస్కరిస్తుంటానని స్పష్టం చేశారు. తమ ఇద్దరి మధ్య వ్యాపారపరమైన సాన్నిహిత్యమే తప్ప మరొకటి లేదని తేల్చి చెప్పారు. తరచూ చోక్సీతో కాఫీకి వెళ్తుంటానని, సాయంత్రం వేళ సముద్రపు ఒడ్డున కలిసి నడుస్తుంటామని పేర్కొన్నారు. ఇద్దరం కలిసి డిన్నర్ చేసిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. చోక్సీ తరచూ తన అపార్ట్‌మెంట్‌కు వస్తుండేవాడనీ ఆమె అన్నారు.

 హద్దులు దాటలేదు..

హద్దులు దాటలేదు..

తమ ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్‌కు మించి ఇంకేమీ లేదని జబారికా తేల్చి చెప్పారు. తాను యూరోపియన్ కావడం వల్ల భారత్‌లోని మీడియాలో మేహుల్ చోక్సీతో తనకు ఉన్న సంబంధాలకు సంబంధించిన కథనాలు తన దృష్టికి రాలేదని క్లారిటీ ఇచ్చారు. ఏదో ఒక లాభంతోనే అతను తనకు హోటల్ రూమ్స్ బుక్ చేసే ఆఫర్ ఇస్తుండేవాడని, తమ మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్‌ను చోక్సీ తప్పుగా అర్థం చేసుకున్నట్టు తనకు అనిపించేదని జబారికా వ్యాఖ్యానించారు. జాలీ హార్బర్ అత్యంత సురక్షిత ప్రదేశమని, చాలామంది తమ కుటుంబాలతో అక్కడికి వస్తుంటారని అన్నారు. అలాంటి చోట మేహుల్ చోక్సీ వంటి ఓ పేరున్న వ్యక్తిని కిడ్నాప్ చేయడం అసాధ్యమని జబారికా తేల్చి చెప్పారు.

English summary
Mehul Choksi's rumoured girlfriend Barbara Jarabica told that the fugitive diamantaire had offered to book her hotel stays and also pay for her flight tickets. She, however, wanted them to be just friends and make sure their relationship is business-oriented.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X