వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా అధ్యక్ష ఎన్నికలు: మెరిసిన మెలానియా, రెండో భార్య కుమార్తె: సపరివార సమేతంగా ట్రంప్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల వాతావరణం రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటిదాకా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన రాజకీయ ప్రత్యర్థులు జో బిడెన్, కమలా హ్యారిస్ మధ్యే ఎన్నికల ప్రచారం సాగింది. తాజాగా డొనాల్డ్ ట్రంప్ తన కుటుంబాన్ని ఎన్నికల బరిలో దింపారు. రిపబ్లికన్ల తరఫున వరుసగా రెండోసారి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారాయన. తమ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్‌ను రిపబ్లికన్లు అధికారికంగా ప్రకటించిన మరుసటి రోజే.. ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, రెండో కుమార్తె టిఫ్ఫనీ ట్రంప్.. ఎన్నికల ప్రచార బరిలో దిగారు.

 రెండో భార్య కుమార్తె.. టిఫ్పనీ

రెండో భార్య కుమార్తె.. టిఫ్పనీ

డొనాల్డ్ ట్రంప్‌ రెండో భార్య మర్లా మ్యాపిల్స్ కుమార్తె టిఫ్పనీ. 26 సంవత్సరాల టిఫ్పనీ లా విద్యార్థిని. అమెరికా కాలమానం ప్రకారం.. మంగళవారం ఏర్పాటైన రిపబ్లికన్ల జాతీయ కన్వెన్షన్‌ను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అమెరికన్లు అధ్యక్షుడిని ఎన్నుకోవాలని అన్నారు. మాటల గారడీలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. తమ వాక్చాతుర్యంతో ఓట్లను కొల్లగొట్టాలనుకునే వారిని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రతి అమెరికా పౌరుడికి ఉద్యోగాలను కల్పించాలనే తపన తన తండ్రిలో ఉందని అన్నారు.

మేక్ అమెరికా గ్రేట్ అమెరికా..

మేక్ అమెరికా గ్రేట్ అమెరికా..

తన తండ్రి మేక్ అమెరికా.. గ్రేట్ అమెరికా నినాదాంతో పనిచేస్తున్నారని టిఫ్పనీ ట్రంప్ చెప్పారు. మరోసారి ఆయనకు అధ్యక్షుడిగా అవకాశాన్ని కల్పించడం వల్ల ఈ కల సాకారమౌతుందని తాను అభిప్రాయపడుతున్నానని అన్నారు. క్రిమినల్ జస్టిస్‌లో తన తండ్రి సంస్కరణలను తీసుకొచ్చారని చెప్పారు. క్రిమినల్ జస్టిస్‌లో సంస్కరణలను తీసుకొచ్చిన ఏకైక అమెరికా అధ్యక్షుడు తన తండ్రేనని అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి కొన్ని కీలక, కఠిన నిర్ణయాలను తీసుకున్నారని చెప్పారు. అతి తక్కువ ధరకు మందులను అందుబాటులోకి తీసుకుని రావడానికి కావాల్సిన చర్యలను తీసుకున్నారని అన్నారు.

మీడియా, టెక్ సంస్థలపై విమర్శలు..

మీడియా, టెక్ సంస్థలపై విమర్శలు..

మీడియా, కొన్ని టెక్ సంస్థలపై టిఫ్ఫనీ విమర్శలు గుప్పించారు. తప్పుడు సమాచారాన్ని జనంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. నిజం కంటే అబద్ధాన్ని ప్రచారం చేయడానికే ఆసక్తి చూపుతున్నాయని మండిపడ్డారు. వాస్తవ పరిస్థితులేమిటనేది ప్రజలకు అందట్లేదని అన్నారు. తప్పుడు సమాచారం వల్ల అమెరికన్లను మానసికంగా బానిసలుగా మార్చే ప్రయత్నానికి పాల్పడుతున్నాయని ఆరోపించారు. బ్యురోక్రసీ, ఫార్మా, మీడియా మోనోపలికి వ్యతిరేకంగా తన తండ్రి పోరాడుతున్నారని చెప్పారు. సవాళ్లను తప్పించుకుని పారిపోయే మనస్తత్వం ట్రంప్‌కు లేదని అన్నారు.

Recommended Video

US Election 2020 : Donald Trump Campaign Releases Commercial Featuring PM Modi || Oneindia Telugu
వైట్‌హౌస్ రోజ్ గార్డెన్ నుంచి మెలానియా

వైట్‌హౌస్ రోజ్ గార్డెన్ నుంచి మెలానియా

వైట్‌హౌస్ రోజ్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన మరో కార్యక్రమంలో మెలానియా మాట్లాడారు. తమ రాజకీయ ప్రత్యర్థులు జాత్యహంకారాన్ని అడ్డుగా పెట్టుకుని విమర్శలు చేస్తున్నారని, తాను ఆ పని చేయదలచుకోలేదని అన్నారు. జాత్యహంకారాన్ని తీసుకొచ్చి, అమెరికన్లను విభజించే ప్రయత్నాలకు పాల్పడుతున్నారని చెప్పారు. అమెరికాను ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలపడానికి, శక్తిమంతమైన దేశంగా మార్చడానికి డొనాల్డ్ ట్రంప్ అహర్నిశలు ప్రయత్నించారని, దానికి అవసరమైన వ్యూహాలు ఆయన వద్ద ఉన్నాయని అన్నారు. మనిషి శరీరరంగును ఆధారంగా చేసుకుని జాతిని నిర్ధారించలేమని చెప్పారు.

English summary
US First lady Melania Trump and President Donald Trump's youngest daughter Tiffany Trump returns to the campaign with speech at the Republican convention on Tuesday. They both were urged young voters to "make a judgement based on results and not on rhetoric".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X