వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెలానియాకు విడాకులు ఇస్తే..డొనాల్డ్ ట్రంప్ ఆరిపోవాల్సిందే: వందల కోట్లు: డైవర్స్‌కే ఛాన్స్?

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అవుట్ గోయింగ్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కుటుంబం విచ్ఛిన్నం కావడం ఖాయంలా కనపిస్తోంది. తన అధికారిక నివాసాన్ని విడిచి పెట్టిన మరుక్షణమే డొనాల్డ్‌ ట్రంప్‌‌నకు విడాకులు ఇవ్వడానికి మూడో భార్య మెలానియా రెడీగా ఉన్నట్లు అమెరికన్ మీడియా చెబుతోంది. ట్రంప్‌తో తన 15 సంవత్సరాల వివాహ బంధానికి ముగింపు పలికడానికి మెలానియా ఎదురుచూస్తున్నారని, ఆ రోజులు ఎంతో దూరం లేవని డొనాల్డ్ ట్రంప్‌ మాజీ రాజకీయ సహాయకురాలు ఒమరోసా న్యూ మ్యాన్‌ చెప్పారు.

కాంట్రాక్ట్ మ్యారేజ్..

కాంట్రాక్ట్ మ్యారేజ్..

డొనాల్డ్‌ ట్రంప్‌, మెలానియా మధ్య భార్యాభర్తల బంధం లేదని, కాంట్రాక్టు మ్యారేజ్‌గా అభివర్ణించారు. అదే జరిగితే- మెలానియాకు దక్కే పరిహారం భారీగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. అమెరికా చట్టాల ప్రకారం కనీసం 68 మిలియన్ డాలర్ల మేర మొత్తం ఆమెకు భరణంగా లభించవచ్చని అంటున్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌, మెలానియా 2005లో వివాహం చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అయిదు నెలల తరువాత మెలానియా అధికారిక నివాసం వైట్‌హౌస్‌కు వచ్చారు.

కుటుంబ బాంధవ్యం అంతంత మాత్రమే..

కుటుంబ బాంధవ్యం అంతంత మాత్రమే..

ఆ సమయంలోనే వారిద్దరి మధ్య కుటుంబ బాంధవ్యం లేదనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీనిపై అమెరికా మీడియా కొన్ని కథనాలు రాసుకొచ్చింది. తన కుమారుడు బారన్ ట్రంప్ చదువుకు ఇబ్బంది కలగకూడదనే కారణంతో వైట్‌హౌస్‌కు రావడానికి ఆలస్యమైనట్టు మెలానియా అప్పట్లో వివరణ ఇచ్చారు. రెండో భార్య మార్లా మ్యాపుల్స్‌తోనూ డొనాల్డ్ ట్రంప్‌ది కాంట్రాక్ట్ మ్యారేజేనని, ఆమెతో వివాహ బంధాన్ని తెంచుకున్నందుకు అప్పట్లో భారీ పరిహారాన్ని ట్రంప్ చెల్లించారని, ఆ తరువాతే మెలానియాను వివాహం చేసుకున్నారని మీడియా వెల్లడించింది.

భారీగా భరణం..

భారీగా భరణం..

ఈ సారి- మెలానియాతో ఇలాంటి ఒప్పందం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. విడాకులు తీసుకున్న ఇద్దరు భార్యలతో పోల్చుకుంటే.. మెలానియాకు వచ్చే మొత్తం అధికంగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఫోర్బ్స్‌ నివేదిక ప్రకారం డొనాల్డ్‌ ట్రంప్‌ సంపద 250 కోట్ల డాలర్లు. మొదటి భార్యకు 14 మిలియన్‌ డాలర్లతోపాటు కనెక్టికట్‌లో ఒక భవనం, న్యూయార్క్‌లో అపార్ట్‌మెంట్‌ ఇచ్చారు ట్రంప్. రెండవ భార్యకు రెండు మిలియన్‌ డాలర్లను భరణంగా అందజేశాడు.

68 మిలియన్ల భరణం..

68 మిలియన్ల భరణం..

వారిద్దరి కంటే మెలానియాకు భరణం మొత్తం అధికంగా ఉంటుందని, 68 మిలియన్ డాలర్లు ఉండొచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. భారతీయ కరెన్సీలో 500 కోట్ల రూపాయలకు పైమాటే. డొనాల్డ్ ట్రంప్-మెలానియా కుమారుడు బారన్‌ను కస్టోడియన్‌‌గా నియమిస్తారని అమెరికన్ జర్నలిస్ట్ మేరీ జోర్డాన్ అంచనా వేశారు. ఇదివరకు ఆమె `అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ మెలానియా ట్రంప్`అనే పుస్తకాన్ని రాశారు. మెలానియాకు చెందే ఆస్తులు, భరణం, ఇతర స్థిర, చరాస్తులకు సంబంధించిన హక్కులన్నీ బారన్‌కు కూడా దక్కుతాయి.

English summary
US President Donald Trump's wife Melania Trump is to get herself a divorce from one of the richest men in the world. The divorce amount is bound to be huge. Melania Trump may receive $68 million in a divorce settlement if she decides to divorce Trump, according to a legal expert.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X