వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ. వెయ్యి కోట్లకు దావా వేసిన ట్రంప్ భార్య

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి బరిలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా తన పరువుకు భంగం కలిగించారని ఆరోపిస్తూ డైలీ మెయిల్, అమెరికాకు చెందిన బ్లాగ్ టార్ ప్లేఫై మీద పరువు నష్టం దావా వేశారు.

తన ప్రతిష్టను దెబ్బతీసినందుకు రూ. 10,000 కోట్లు (150 మిలియన్ డాలర్లు) చెల్లించాలని అమెరికాలోని మేరీలాండ్ కోర్టులో ఆమె దావా దాఖలు చేశారు. న్యూయార్క్ లో మెలానియా పార్ట్ టైమ్ సెక్స్ వర్కర్ గా పని చేశారని డైలీ మెయిల్ ప్రచురించింది.

Melania Donald Trump files Defamation

అదే సందర్బంలో మెలానియాకు డోనాల్డ్ ట్రంప్ పరిచయం అయ్యాడని డైలీ మెయిల్ తెలిపింది. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మెలానియా మేరీలాండ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

మెలానియాపై రాసిన కథనాలు అన్నీ అసత్యమని ఆమె తరుపు న్యాయవాది చార్లెస్ హార్డర్ కోర్టులో చెప్పారు. డైలీ మెయిల్ తెలిపిన కథనాలలో ఎలాంటి వాస్తవం లేదని, మెలానియా గురించి రాసిందంతా వంద శాతం అబద్దం అని అని అన్నారు.

Melania Donald Trump files Defamation

అమె వృత్తిపరమైన, వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా కథనాలు రాశారని, తన గురించి ఇష్టం వచ్చినట్లు రాసిన రెండు సంస్థల పై 150 మిలియన్ డాలర్లకు పరువు నష్టం దావా వేశారని చార్లెస్ హార్డర్ చెప్పారు.

మెలానియా స్లోవెనియాలో జన్మించారు. ఆమె 1990లో అమెరికాలో మోడల్ గా పని చేశారు. 2005లో డోనాల్డ్ ట్రంప్ ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె డోనాల్డ్ ట్రంప్ తో కలిసి జీవిస్తున్నారు.

English summary
These defendants made several statements about Mrs. Trump that are 100% false and tremendously damaging to her personal and professional reputation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X