వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటిపోరు: ట్రంప్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మెలానియా

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలపై ఇప్పటి వరకు బయట నుంచే విమర్శలు ఎదురయ్యేవి. ఇక ఆయన సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు ఎదురవుతున్నాయి. సొంత పార్టీ అంటే పార్టీ మనుషులు కాదు... ఏకంగా అమెరికా ప్రథమ మహిళ, ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ ఆమె భర్త నిర్ణయాలపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.

వలసదారులపై అమెరికా తీసుకున్న కఠిన నిర్ణయం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు కారణమవుతోంది. ఇదే సమయంలో అమెరికాలో వలసదారులపై అనుసరిస్తున్న తీరు మారాలని స్వయంగా మెలానియా వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. ఫాదర్స్ డే సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న మెలానియా... వలసదారుల కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడం తగదని అన్నారు. చట్టాల పేరుతో చిన్న పిల్లలను తమ కుటుంబం నుంచి వేరు చేయడం తగదని మెలానియా అన్నారు. అమెరికా అంటే అన్ని చట్టాలు అమలు చేయడమే కాదు... సరైన పాలనతో అందరి హృదయాలను గెలుచుకోవాలి అని ఆమె అభిప్రాయపడ్డారు.

Melania Trump appeals to put an end to To Migrant Family Separations

ఇదిలా ఉంటే అమెరికా మాజీ ప్రథమ మహిళ లౌర బుష్ కూడా ట్రంప్ విధానాలను తప్పుబట్టారు. అమెరికా సరిహద్దులను పరిరక్షించుకునేందుకు చట్టం తీసుకురావడం మంచిదే కానీ... వలసదారులపై అత్యంత కఠినాత్మకంగా వ్యవహరించడం సరైనది కాదని వాషింగ్టన్ పోస్ట్‌లో రాశారు.

ట్రంప్ ప్రభుత్వాన్ని ప్రస్తుతం కుదిపేస్తోన్న అంశం వలసదారుల విధానం. ఇప్పటి వరకు 2వేల మైనర్లు తమ కుటుంబం నుంచి వేరు చేయబడ్డారని స్వయంగా ప్రభుత్వమే ప్రకటించడంపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. మెక్సికో నుంచి వలసదారులు అమెరికా సరిహద్దులోకి ప్రవేశిస్తే అరెస్టు చేస్తామని గత నెలలో అమెరికా అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ ప్రకటించిన తర్వాత... వలసదారుల ఏరివేత సంఖ్య మరింతగా పెరిగింది.

English summary
American President Donald Trump is facing a huge outbreak on the immigration policy. Till now only the opposition parties raised their voice against this controversial policy. But now America's first lady Melania Trump also opposed this policy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X