వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇవాంకా విషయంలో కొత్త వివాదంలో మెలానియా ట్రంప్ .. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ పుస్తక రగడ !!

|
Google Oneindia TeluguNews

యుఎస్ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో కొత్త వివాదంలో చిక్కుకున్నారు .అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఎన్నికల బరిలోకి దిగిన డోనాల్డ్ ట్రంప్, యుఎస్ ప్రథమ మహిళ, ట్రంపు భార్య మెలానియా ట్రంప్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు .రెండోసారి అత్యున్నత యూఎస్ ప్రెసిడెంట్ పీఠాన్ని దక్కించుకోవాలని పోటీ పడుతున్న సమయంలో ఇవాంక విషయంలో మెలానియా అనుచిత వ్యాఖ్యలు చేశారనే వార్త ఇప్పుడు అమెరికాలో హాట్ టాపిక్ గా మారింది.

ట్రంప్ కుమార్తె ఇవాంకాపై మెలానియా ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు .. ఓ రిపోర్టర్ వరుస ట్వీట్స్

ట్రంప్ కుమార్తె ఇవాంకాపై మెలానియా ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు .. ఓ రిపోర్టర్ వరుస ట్వీట్స్

యూఎస్ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, అధ్యక్షుడు ట్రంప్ పెద్ద కుమార్తె అయిన ఇవాంక ట్రంప్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లుగా తాజాగా ఒక వార్త వెలుగులోకి వచ్చింది. మెలానియా స్నేహితురాలు, ఒకప్పటి సిబ్బంది అయిన స్టెఫానీ విన్ స్టన్ వాకాఫ్ రాసిన పుస్తకంలో మెలానియా ట్రంప్ తన సవతి కుమార్తె అయిన ఇవాంకా ట్రంప్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రస్తావించారని ఆ దేశ మీడియా రిపోర్టర్ యాషర్ ఆలీ పేర్కొన్నారు . దానికి సంబంధించి ఆయన వరుస ట్వీట్లను సైతం చేశారు.

'మెలానియా అండ్ మీ ' ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ మై ఫ్రెండ్ షిప్ విత్ ఫస్ట్ లేడీ అనే పుస్తకంలో వివాదాస్పద విషయాలు

'మెలానియా అండ్ మీ ' ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ మై ఫ్రెండ్ షిప్ విత్ ఫస్ట్ లేడీ అనే పుస్తకంలో వివాదాస్పద విషయాలు

'మెలానియా అండ్ మీ ' ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ మై ఫ్రెండ్ షిప్ విత్ ఫస్ట్ లేడీ అనే పుస్తకంలో మెలానియా తన సవతి పిల్లల గురించి ముఖ్యంగా తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లుగా రాసినట్లు సమాచారం. మెలానియా ట్రంప్ కు తెలియకుండానే స్నేహితురాలు, మెలానియా కు సిబ్బంది గా పనిచేసిన స్టెఫానీ విన్ స్టన్ ఆమె వ్యాఖ్యలను రికార్డు చేసినట్లుగా రిపోర్టర్ యాషర్ ఆలీ పేర్కొన్నారు .

ఇదే సమయంలో ఆమె ట్రంప్ గురించి కూడా వ్యాఖ్యలు చేశారని వాటిని బహిర్గతం చేయలేదని రాసుకొచ్చారు.

మెలానియా దగ్గర పని చేసిన, సన్నిహితంగా ఉన్న స్టెఫానీ విన్ స్టన్ పుస్తకం

మెలానియా దగ్గర పని చేసిన, సన్నిహితంగా ఉన్న స్టెఫానీ విన్ స్టన్ పుస్తకం


మెలానియా ట్రంప్ ఒకప్పుడు కొత్త చీఫ్ ఆఫ్ స్టాఫ్‌ను నియమించడానికి ప్రయత్నించినప్పుడు ఇవాంకా అడ్డుకున్నారని ఆమెపై కోపంగా ఉన్నారని ఆమె పుస్తకంలో పేర్కొంది. ఈ విషయాన్ని పుస్తకంతో సంబంధమైన కొందరు వ్యక్తులు ధ్రువీకరించిన ప్పటికీ, అసలు ఇవాంకా గురించి మెలానియా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఏంటి అనేది ఇంకా బయటకు రాలేదు. స్టెఫానీ విన్ స్టన్ మెలానియా ట్రంప్ వద్ద ఓ దశాబ్ద కాలం పాటు పని చేశారు. అత్యంత సన్నిహితంగా ఉన్నారు .

Recommended Video

Melania Trump Planning To Implement Indian Students Skills In USA
సెప్టెంబర్ 1 న బుక్ రిలీజ్ ... ఎన్నికల వేళ ఇంకేం జరగనుందో !!

సెప్టెంబర్ 1 న బుక్ రిలీజ్ ... ఎన్నికల వేళ ఇంకేం జరగనుందో !!

ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపణలతో ఆమె మెలానియా ట్రంప్ కు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె రాసిన పుస్తకం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ పుస్తకం సెప్టెంబర్ 1 న విడుదల కానుంది.
ఎన్నికల సమయంలో విడుదల అవుతున్న ఈ పుస్తకం మరిన్ని వివాదాలకు కారణం అవుతుందో ? ట్రంప్ ను ఎన్నికల్లో ఇరకాటంలో పెట్టటానికి ఈ పుస్తకం పోటీలో ఉన్న పార్టీలకు ఆయుధంగా మారుతుందా అనేది ఆసక్తికర అంశం .

English summary
At a time when Donald Trump is looking to get re-elected for a second term as US President, a new book threatens to add a roadblock in the way.The book has been written by US first lady Melania Trump’s friend and staffer Stephanie Winston Wolkoff. It is titled ‘Melania & Me: The Rise and Fall of My Friendship with the First Lady’.Among the explosive claims made by Wolkoff in the memoir are the negative and harsh comments made by the first lady against Trump and his adult children. The comments were reportedly caught on tape by her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X