వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓ వైపు వరద బీభత్సం: అమెరికన్లు విస్తుపోయేలా ట్రంప్-మెలానియా

వరద ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లిన సందర్భంలో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్ మరీ సోకులకు వెళ్లారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: వరద ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లిన సందర్భంలో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్ మరీ సోకులకు వెళ్లారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

టెక్సాస్ చిన్నభిన్నం

టెక్సాస్ చిన్నభిన్నం

ఇటీవల తీవ్ర వర్షాలు, వరదలతో టెక్సాస్ ఛిన్నాభిన్నం అయిన విషయం తెలిసిందే. ట్రంప్, ఆయన సతీమణి ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా అత్యంత ఫ్యాషనబుల్‌గా కనిపించేందుకు ట్రంప్, మెలానియా ప్రయత్నించారు. ఇది అమెరికన్లు విస్తుపోయేలా చేసింది.

మెలానియా ఇలా..

మెలానియా ఇలా..

ముఖ్యంగా మెలానియా మరీ ఎత్తుగా ఉన్న హైహీల్స్ వేసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. టెక్సాస్‌ను వరదలు ముంచెత్తితే ట్రంప్, మెలానియాలు సోకులకు పోవడం ఏమిటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్రంప్ ఇలా..

ట్రంప్ ఇలా..

టైలర్ట్ కాప్రి ప్రింట్, ఆర్మీ ఆకుపచ్చ రంగు బాంబర్ జాకెట్, ఏవియేటర్ సన్ గ్లాసెస్, స్కై హైహిల్స్ షూస్‌ను మెలానియా ధరించింది. ట్రంప్ హుడెడ్ రెయిన్ జాకెట్, ఖాకీ రంగు ప్యాంటు, ముదురురంగు బూట్లు వేసుకున్నారు.

నెటిజన్ల ఆగ్రహం

నెటిజన్ల ఆగ్రహం

వీరి తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. 'మెలానియా అచ్చం వరదలను చూస్తున్న బార్బీలా ఉంది' అంటూ రచయిత మారియా ఎద్దేవా చేశారు. 'టెక్సాస్ వాసులారా ఆందోళన వద్దు. సాయం అందుతుంది. మెలానియా తుఫాన్ అంత ఎత్తున హైహీల్స్ వేసుకుంది' అని మరొకరు ట్వీట్ చేశారు.

కాగా

కాగా

టెక్సాస్‌లో కుండపోత వర్షాలు కురిశాయి. సహాయం కోసం అర్థిస్తున్నవారిని కాపాడటానికి సహాయక బృందాలకు భారీ వర్షాలు ఆటంకంగా మారాయి. మరోవైపు అతిభారీ వర్షాలు కురవనున్నాయని జాతీయ వాతావరణ విభాగం హెచ్చరించింది.

English summary
First Lady Melania Trump is making waves... for her flood fashion. The former model is always elegantly turned out and perfectly coiffed, and Tuesday was no exception as she left the White House with her president husband for storm-ravaged Texas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X