వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెలానియా వంతు: బిడెన్, డెమోక్రాట్లపై నిప్పులు.. కరోనాపై రాజకీయం అంటూ ఫైర్..

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికకు ఓటు వేసే కొద్దీ గంటల ముందు ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ ప్రచారం నిర్వహించారు. నార్త్ కరోలినాలో గల హంటర్స్‌విల్లేలో ఆమె నాలుగోసారి ఒకరే క్యాంపెయిన్ చేశారు. కరోనా వైరస్, మిలిటరీ, లా అండ్ ఆర్డర్ నుంచి డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రట్లు చేస్తోన్న ఆరోపణలను మెలానియా ఖండించారు.

నగరాల్లో దోపిడీదారులు విధ్వంసం సృష్టించి.. అల్లర్లకు కారణమవుతున్నారని మెలానియా పేర్కొన్నారు. దీంతో చిన్న వ్యాపారులు.. కష్టపడి పనిచేసేవారికి కష్టమవుతోందని తెలిపారు. ఇలా జరిగిన సమయంలో డెమోక్రాట్లు ఎక్కడ అని మెలానియా అడిగారు. ఇదే విధంగా శనివారం పెన్సిల్వేనియాలో కూడా మెలానియా ప్రసంగించిన సంగతి తెలిసిందే.

 Melania Trump slams Biden and Democrats in final solo campaign speech

బిడెన్ లక్ష్యంగా మెలానియా విమర్శలు కొనసాగాయి. ఇటు ట్రంప్ కూడా కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. బిడెన్ మంచి చేస్తారని తమకు నమ్మకం లేదన్నారు మెలానియా. ఎందుకంటే అతని 47 ఏళ్ల రాజకీయ జీవితం చూసినట్లయితే అర్థమవుతోందన్నారు. కానీ ట్రంప్ నినాదం మాత్రం అమెరికన్ ప్రజలు ఫస్ట్ అని ఉద్ఘాటించారు. ట్రంప్, సిబ్బందిపై వివక్ష గురించి మెలానియా ప్రధానంగా ప్రస్తావించారు.

అసహనం, హింస వల్ల నిజాయితీ, కష్టపడే వారికి ఇబ్బందులు వస్తాయని చెప్పారు. వైట్ హౌస్ సిబ్బంది ఇదివరకు రెస్టారెంట్లలో పని చేయడానికి వచ్చిన సందర్భంలో అవకాశం ఇవ్వలేదన్నారు. కొన్ని టెక్ కంపెనీలు ఇప్పుడు రాజకీయంగా ఉన్నాయని చెప్పారు. అవన్నీ భరిస్తూ.. ప్రజల ముందుకు వచ్చామని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ను మీడియా, డెమోక్రాట్లు రాజకీయం చేస్తున్నారని మెలానియా విమర్శించారు.

English summary
First lady Melania Trump gave her fourth solo campaign speech on Monday afternoon in Huntersville, North Carolina.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X