వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరిగించిన కన్నీళ్లు.!ఏడ్చిన డెలివరీ బాయ్.!దోచుకుంది వెనక్కిచ్చి, హగ్గిచ్చి, ఓదార్చి వెళ్లిపోయిన దొంగ

|
Google Oneindia TeluguNews

కరాచి/హైదరాబాద్ : అప్పుడప్పుడు అనుకోకుండా జరిగే కొన్ని సంఘటనలు గమ్మత్తుగా పరిణమించడంతో పాటు ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని కలిగిస్తుంటాయి. ఎదుటి వాళ్లు తలపెట్టే మంచికైనా, చెడుకైనా ఇలాంటి ఘటనలతో అవినాభావ సంబంధం ఎక్కువగా ఉంటుంది. ఐతే జరిగిన సంఘటన ఏదైనా కాస్త సహనం, ఓర్పు ఉంటే జరగబోయే పరిణామంలో ఎంతో వైవిద్యం చోటుచేసుకుంటుంది. ఊహించని అనుభవం కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిస్తే చేజారిపోయింది కూడా తిరిగి సొంతం అవుతుందనే పచ్చి నిజం కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. కాయ కాష్టం చేసి కాలం వెళ్లదీస్తున్న ఓ డెలిరీ బాయ్ దోపిడీ వ్యవహారం ఇవే అంశాలను నిర్ధారిస్తున్నాయి.

కన్నీళ్లే కాపాడాయి. దోపిడీ దొంగల మనసు కరిగించిన డెలివరీ బాయ్ ఏడుపు..

కన్నీళ్లే కాపాడాయి. దోపిడీ దొంగల మనసు కరిగించిన డెలివరీ బాయ్ ఏడుపు..

జీవితంలో కొన్ని సంఘటనలు ఊహించని మలుపులు తిరుగుతుంటాయి. సర్వం కోల్పోయాం దేవుడా ఇప్పుడేంటి పరిస్దితి అనుకునే సమయంలో అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి. సమాజంలో జీవనం కొపసాగించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో, దోపిడీ దొంగతనాలు చేయడానికి కూడా అన్ని మార్గాలు కూడా ఉంటాయి. కాకపోతే ఒకడు కష్టపడి రాజమార్గంలో సంపాదించుకోవాలని అనుకుంటే మరోకడు దొంగదారుల్లో వేగంగా సంపాదించుకోవాలని కుయుక్తులు పన్నుతుంటాడు. సరిగ్గా ఇలాంటి ఆలోచనలతో ముందుకెళ్తున్న వారి మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన డెలివరీ బాయ్..

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన డెలివరీ బాయ్..

పాకిస్తాన్ దేశంలోని కరాచి నగరంలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఊరూ వాడా తిరికి వారు ఆన్ లైన్ లో ఆర్దర్ చేసుకున్న వస్తువులను వారికి అందించి ఎంతో కొంత సంపాదించుకునే డెలివరీ బాయ్ జీవితంలో అనుకోని సంఘటన చోటుచేసుకుంది. యధావిధిగా విధి నిర్వహణలో భాగంగా డోర్ డెలివరీ చేసి వెరక్కి తిరిగి తన వాహనం వద్దకు వచ్చిన ఆ డెలివరీ బాయ్ ని ఇద్దరు దారి దోపిడి దొంగలు అటకాయించారు. అంతటితో ఆగకుండా డెలివరీ బాయ్ దగ్గరు ఉన్న విలువైన వస్తువులను దోచుకున్నారు. అనుకోకుండా జరిగిన పరిణామానికి డెలివరీ బాయ్ అవాక్కయ్యాడు. చేసేది ఏమీ లేక దొంగల ముందే బోరున ఏడ్చేసాడు.

ఎక్కెక్కి ఏడ్చిన డెలివరీ బాయ్.. దోచుకుంది వెనక్కిచ్చిన దొంగలు..

ఎక్కెక్కి ఏడ్చిన డెలివరీ బాయ్.. దోచుకుంది వెనక్కిచ్చిన దొంగలు..

ఆ డెలివరీ బాయ్ కళ్ల నుండి వస్తున్న కన్నీళ్లు కరుడుగట్టిన ఆ దారిదోపిడీ దొంగల మనసును కరిగించాయి. డెలివరీ ఇచ్చి వెళ్లే సమయంలో అటుగా ద్విచక్ర వాహనం మీద వచ్చిన ఇద్దరు దొంగలు డెలివరీ బాయ్‌ ని అటకాయించారు. దుండగులు డెలివరీ బాయ్ ని బెదిరించి అతడి దగ్గర ఉన్న ఖరీదైన వస్తువులను లాక్కుని జేబులో పెట్టెకున్నారు. బక్క పలచగా ఉన్న డెలవరీ బాయ్ వచ్చిన ఆగంతకులను ఎదురించలేడు. ఎదురించాలంటే అతని దగ్ర ఏదైనా పదునైన ఆయుధం ఉండాలి. మన వాడి దగ్గర అదికూడా లేదు. దీంతో ఏం చేయాలో తెలియని డెలివరీ బాయ్ ఎక్కెక్కి కన్నీటి పర్యంతం అయిపోయాడు.

డెలివరీ బాయ్ ని ఓదార్చి, వాటేసుకున్న దొంగ.. కరాచీలో చోటుచేసుకున్న విచిత్ర ఘటన..

డెలివరీ బాయ్ ని ఓదార్చి, వాటేసుకున్న దొంగ.. కరాచీలో చోటుచేసుకున్న విచిత్ర ఘటన..

ఇదిలా ఉండగా దొంగలకు కూడా మనసు ఉంటుందని, అది కన్నీళ్లకు కరుగుతుందని దోపిడీ చేసిన దొంగలు నిరూపించారు. డెలివరీ బాయ్ ఏడుపుతో మనసు మార్చుకున్న ఆ ఇద్దరు దొంగలు అతడి వస్తువులను తిరిగి ఇచ్చేశారు. అంతేకాదు అందులో ఒకరు బైక్‌పైనే ఉండగా, కిందికి దిగిన మరో వ్యక్తి డెలివరీ బాయ్‌ని హత్తుకొని ఓదార్చాడు. ఆ తరువాత అక్కడి నుంచి ఆ ముగ్గురు వెళ్లిపోయారు. పాకిస్థాన్ రాజధాని కరాచీలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్కడున్న సీసీ కెమెరాల్లో ఈ ఘటన మొత్తం రికార్డు కాగా, ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డెలివరీ బాయ్ ఏడుపు, దొంగల వ్యవహారం, వారి మద్య జరిగిన సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా మారింది.

English summary
The two robbers who had changed their mind when the delivery boy cried, returned his belongings. One of them embraced the delivery boy and comforted him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X