వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొండచిలువలను బంధిస్తే డాలర్లు,15 అడుగుల ఫైతాన్ ను ఇలా...

:కొండ చిలువను చూస్తేనే భయంతో పరుగులు తీస్తాం, కాని, దాని దగ్గరకు వెళ్ళాలంటే ప్రాణాలు గాల్లోనే పోతాయి. అయితే అమెరికాలో 15 అడుగుల పొడవున్న ఓ కొండచిలువను ఇద్దరు వ్యక్తులు పట్టుకొన్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఫ్లోరిడా:కొండ చిలువను చూస్తేనే భయంతో పరుగులు తీస్తాం, కాని, దాని దగ్గరకు వెళ్ళాలంటే ప్రాణాలు గాల్లోనే పోతాయి. అయితే అమెరికాలో 15 అడుగుల పొడవున్న ఓ కొండచిలువను ఇద్దరు వ్యక్తులు పట్టుకొన్నారు.

అమెరికాలోని ఫ్లోరిడాలోని ఎవర్ గ్లేడ్స్ లో ఓ పదిహేను అడుగుల భారీ కొండ చిలువను నిక్ బానోస్, లియోనార్డో సాంచేజ్ అనే ఇద్దరు వ్యక్తులు పట్టుకొన్నారు. దాని బరువు సుమారు 144 పౌండ్లు ఉంటుంది.

వీరిద్దరూ కూడ దక్షిణ ప్లోరిడాలోని వాటర్ మేనేజ్ మెంట్ విభాగంలో ఉద్యోగులుగా ఉన్నారు.ప్రస్తుతం ఈ విభాగం తరపున కొండచిలువలను ఏరివేసే కార్యక్రమం పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు.

ప్రభుత్వమే కొండచిలువలను ఏరివేసేందుకుగాను ప్రోత్సాహకాలు ఇస్తోంది. వ్యక్తిగతంగా కూడ ఇందులో పాల్గొని కొండచిలువలను వేటాడవచ్చు.

python

చిన్నవి, పెద్దవనే తేడా లేకుండా వాటిని గుర్తించి వేటాడాల్సి ఉంటుంది. నాలుగు అడుగులున్న పైథాన్ ను పట్టుకొన్నవారికి 50 డాలర్లు చెల్లిస్తారు. అయితే మీటరుకు అదనంగా 25 డాలర్లు చెల్లిస్తారు.

తాజాగా 15 అడుగుల కొండచిలువను పట్టుకొన్నట్టు బానోస్ తెలిపాడు. అయితే వీటిని పట్టుకోవడం చంపడం అంత తేలికైన విషయం కాదన్నాడాయన.

English summary
Snake wranglers Nick Banos and Leonardo Sanchez had a career-making catch during a hunt in the Florida Everglades on Saturday when they wrestled a 15-foot, 144-pound python into submission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X