వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పురుషులు కూడ గర్భం దాల్చొచ్చు, ఇలా చేస్తే చాలు

మహిళల మాదిరిగానే పురుషులు కూడ గర్భం దాల్చే రోజులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

టెక్సాస్: మహిళల మాదిరిగానే పురుషులు కూడ గర్భం దాల్చే రోజులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పిల్లల్ని కనడం కేవలం మహిళలకే సాధ్యం. అయితే నిపుణులు మాత్రం రానున్న రోజుల్లో కూడ పురుషులు గర్భం దాల్చి పిల్లల్ని కనే అవకాశాలను కొట్టిపారేయలేమని చెబుతున్నారు. ఇదే జరిగితే భవిష్యత్తులో అనుహ్య మార్పులు చోటుచేసుకొనే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

పిల్లల్ని కనడం అనేది పురుషులకు చేతకాదు. మానవ అవయవ నిర్మాణంలో పిల్లల్ని కనడం కోసం మహిళలకు ప్రత్యేకంగా అవయవ నిర్మాణం ఉంటుంది. ఈ కారణంగానే పిల్లల్ని కనే శక్తి ఆడవారికే ఉంటుంది.

అయితే ప్రపంచ వ్యాప్తంగా అనేక మార్పులు చోటుచేసుకొంటున్నాయి. అయితే ఈ మార్పుల కారణంగా వైద్య శాస్త్రంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. అయితే లింగమార్పిడి చేసుకొని పురుషులు స్త్రీగా మారిన సందర్భాలు కూడ లేకపోలేదు.

స్త్రీలు కూడ పురుషులుగా మారిన సందర్భాలు కూడ ఉన్నాయి. అయితే లింగ మార్పిడి తరహలోనే పిల్లల్ని కనేలా పురుషుల్లో కూడ మార్పులు చేయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

పురుషులు కూడ పిల్లల్ని కనొచ్చు

పురుషులు కూడ పిల్లల్ని కనొచ్చు

మగవాళ్లు కూడ గర్భం దాల్చే రోజులు రానున్నాయని నిపుణులు చెబుతున్నారు. మగవారు కూడా పిల్లల్ని కనడానికి భవిష్యత్తులో పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చని డాక్టర్‌ రిచర్డ్‌ పాల్సన్‌ స్పష్టం చేశారు. అమెరికా పునరుత్పత్తి వైద్య సంఘం అధ్యక్షుడు అయిన పాల్సన్‌ శాన్ ఆంటోనియోలో నిర్వహించిన వార్షిక సమావేశంలో ఈ విషయమై స్పష్టత ఇచ్చారు.

లింగమార్పిడి తరహలోనే గర్భాశయ మార్పిడి

లింగమార్పిడి తరహలోనే గర్భాశయ మార్పిడి

లింగమార్పిడి తరహలోనే పురుషులు గర్భాశయ మార్పిడికి కూడా ముందుకు రావచ్చని పాల్సన్ శాన్ అభిప్రాయపడ్డారు. లింగ మార్పిడి అనంతరం పురుషుడిలో గర్భాశయాన్ని ప్రవేశపెట్టడానికి శారీరకంగా ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని అన్నారు. సాధారణ పురుషుల్లో కాన్పు మాములు విషయం కాదని ఆయన చెప్పారు.

స్త్రీలలో పొత్తి కడుపు నిర్మాణంలో తేడా

స్త్రీలలో పొత్తి కడుపు నిర్మాణంలో తేడా

పురుషులు, స్త్రీల మధ్య పొత్తి కడుపు నిర్మాణం తేడాగా ఉంటుంది. స్త్రీలు పిల్లలకు జన్మనిచ్చేందుకు ఈ నిర్మాణం సులువుగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో స్త్రీలకు సిజేరియన్ చేయకుండానే ప్రసవం జరిగే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. అయితే పురుషుల్లో కడుపు నిర్మాణం మాత్రం భిన్నంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కారణంగానే పురుషులు గర్భం దాలిస్తే ఖచ్చితంగా సిజేరియన్ ద్వారానే కాన్పు చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమౌతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

పురుషులకు కృత్రిమంగా హర్మోన్లు ఇవ్వాలి

పురుషులకు కృత్రిమంగా హర్మోన్లు ఇవ్వాలి


స్త్రీలకు సహజంగానే హర్మోన్లు విడుదల అవుతాయి. అయితే పురుషులకు మాత్రం ప్రత్యేకంగా హర్మోన్లు ఇవ్వాల్సి ఉంటుంది. గర్భాశయంలో పిండం సక్రమంగా ఎదగడానికి మహిళల్లో ప్రకృతిసిద్ధంగా కొన్ని హార్మోన్లు విడుదల అవుతాయి. మగవారికి అవసరమైన మందులు మార్కెట్లలో విరివిగా ఉన్నాయని పాల్సన్ చెప్పారు. ఈ కారణంగా మగవారు పిల్లలను కనేందుకు ఎలాంటి ఇబ్బందులుండవని ఆయన చెప్పారు.

English summary
Men could become pregnant "tomorrow" thanks to advances in womb transplantation, according to a leading fertility expert.The success of womb transplants into women has paved the way for a similar operation being carried out on people born male, reports The Daily Mail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X