• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాక్‌కు వ్యతిరేకంగానా, మనం బొక్కబోర్లా పడ్డాం, మోడీ హైజాక్: జిన్‌పింగ్‌పై చైనా మేధావుల ఆగ్రహం

|

బీజింగ్: పాకిస్తాన్‌లోని టెర్రరిస్టులపై భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహాత్మకంగా బ్రిక్స్ సదస్సులో ప్రకటన చేసి, అన్ని దేశాల మద్దతు పొందారు. చివరకు చైనా కూడా టెర్రరిస్టులపై పోరాడుదామని సదస్సు వేదికపై చేతులు కలిపింది.

చదవండి: అమెరికా మరిన్ని గిఫ్ట్ ప్యాకేజీలు: ఉ.కొరియా, యుద్ధం చేయాలని లేదు కానీ: నిక్కీ

అయితే, దీనిని చైనాలోని కొందరు మేధావులు తప్పుబడుతున్నారు. బ్రిక్స్ వేదికగా ఆఫ్గన్, పాక్‌లోని తీవ్రవాద సంస్థలపై పోరాటానికి మద్దతివ్వడం చైనా చేసిన తప్పు అని, బ్రిక్స్ సదస్సును భారత్ హైజాక్ చేసిందని ఆరోపిస్తున్నారు.

చదవండి: చైనా సహా బ్రిక్స్‌పై పాకిస్తాన్ భగ్గు, 'ఎవరికీ తలవంచమని నిరూపించిన మోడీ'

భారత్ హైజాక్ చేసిందంటూ అక్కసు

భారత్ హైజాక్ చేసిందంటూ అక్కసు

తద్వారా, చైనా మేధావులు భారత్‌పై మరోసారి తమ అక్కసును వెళ్లగక్కారు. బ్రిక్స్ దేశాల సదస్సు లక్ష్యాన్ని భారత్ హైజాక్ చేసిందని వారు పరోక్షంగా చెబుతున్నారు. బ్రిక్స్ దేశాలు చేసిన తీర్మానం ఉగ్రప్రేరేపిత దేశమైన పాకిస్తాన్‌ను లాగిపెట్టి కొట్టినట్లైందని అన్ని దేశాలు భావిస్తుండగా, ఆ తీర్మానానికి చైనా ఎందుకు మద్దతిచ్చిందని ఆ దేశంలోని మేధావులు ప్రశ్నించడం విడ్డూరం.

భవిష్యత్తులో పర్యావసనాలు అంటూ హెచ్చరిక

భవిష్యత్తులో పర్యావసనాలు అంటూ హెచ్చరిక

ఈ తీర్మానం చేసి చైనా పెద్ద తప్పు చేసిందని, భవిష్యత్‌లో దీని పర్యవసానాలను చైనా తప్పక ఎదుర్కొంటుందని చైనాలోని కొందరు మేధావులు హెచ్చరిస్తున్నారు. జియామెన్ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సులో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్‌ను సభ్య దేశాలు తూర్పారపట్టాయి.

పాక్‌కు చైనా ప్రధాని వార్నింగ్

పాక్‌కు చైనా ప్రధాని వార్నింగ్

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే సహించేది లేదని, ఇకనైనా ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని బ్రిక్స్ వేదికగా చైనా ప్రధాని జీ జిన్‌పింగ్.. పాకిస్తాన్‌ను హెచ్చరించారు. అంతేకాదు పాకిస్తాన్‌, ఆప్ఘనిస్తాన్‌లో ఆశ్రయం పొందుతున్న లష్కరే తోయిబా, జైషే మహ్మద్, ఐసిస్, ఆల్ ఖైదా సహా పలు ఉగ్ర సంస్థలకు వ్యతిరేకంగా చేసిన తీర్మానానికి చైనా ఆమోదం తెలిపింది.

భారత్ అతి గొప్ప విజయంగా

భారత్ అతి గొప్ప విజయంగా

చైనా తీరుతో ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయి. సహజంగానే పాకిస్తాన్-చైనా మధ్య బందం చాలా గట్టిది. అలాంటిది పాక్‌పై చైనా ఆగ్రహం వ్యక్తం చేయడంతో అంతా విస్తుపోయారు. దౌత్యపరంగా భారత్ సాధించిన గొప్ప విజయంగా అందరూ అభివర్ణిస్తున్నారు.

చైనా మేధావి హెచ్చరిక

చైనా మేధావి హెచ్చరిక

ఇదే సమయంలో చైనాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు హు షిషెంగ్... చైనా విధానాలను తప్పుపట్టారు. అసలు ఉగ్రసంస్థలకు వ్యతిరేకంగా తీర్మానం చేసి ఏం చెప్పాలనుకుంటున్నారని ప్రశ్నించారు. చైనా చాలా పెద్ద తప్పు చేసిందని, దీని పర్యవసానాలను భవిష్యత్ కాలంలో అనుభవిస్తుందని ఆయన అన్నారు.

టెర్రరిజాన్ని అంతమొందించాలి కానీ

టెర్రరిజాన్ని అంతమొందించాలి కానీ

టెర్రరిజానికి వ్యతిరేకమేనని, అన్ని రూపాల్లోని టెర్రరిజాన్ని కచ్చితంగా వ్యతిరేకించాల్సిందేనని హూ షిషెంగ్ అన్నారు. ఉగ్రవాదాన్ని ఎవరు ప్రేరేపించినా ముక్తకంఠంగా ఖండించాలన్నారు. అయితే బ్రిక్స్ దేశాల ముఖ్య ఉద్దేశాన్ని మరిచి టెర్రరిజం గురించి ప్రస్తావించడం ఏమిటని ప్రశ్నించారు.

చైనాపై దాని ప్రభావం ఉంటుంది

చైనాపై దాని ప్రభావం ఉంటుంది

కొందరు కావాలనే సదస్సు ముఖ్య లక్ష్యాన్ని హైజాక్ చేసి టెర్రరిజం అనే అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారని, భారత్‌ను ఉద్దేశించి పరోక్షంగా ఆయన అన్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలపై చైనా చేసిన వ్యాఖ్యల వల్ల ఆదేశాలతో ఉన్న మిత్రత్వంపై ప్రభావం చూపుతుందన్నారు.

చైనా, బొక్కబోర్లా, భారత్ ఘనవిజయం అన్న హు షిషెంగ్

చైనా, బొక్కబోర్లా, భారత్ ఘనవిజయం అన్న హు షిషెంగ్

బ్రిక్స్ సదస్సులో చైనా ఏదైతే ప్రస్తావన తీసుకురావద్దని అనుకుందో భారత్ అదే ప్రస్తావన తీసుకువచ్చిందని, భారత్ ఈ విషయంలో ఘన విజయం సాధించిందన్నారు. ఇదే సమయంలో చైనా బొక్కబోర్లా పడిందని వ్యాఖ్యానించారు. ఈ తీర్మానంతో పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ రాజకీయ వ్యవహారల్లో చైనా పాత్ర తగ్గిపోతుందన్నారు.

పాక్ సంస్థలను ఎందుకు చేర్చారని మరొకరి ప్రశ్న

పాక్ సంస్థలను ఎందుకు చేర్చారని మరొకరి ప్రశ్న

పాకిస్తాన్‌కు చెందిన సంస్థలను ఎందుకు తీర్మానంలో చేర్చారని షాంఘై మున్సిపల్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్‌కు చెందిన వాంగ్ దేహువా అనే మరో నిపుణులు ప్రశ్నించారు. పాకిస్తాన్ తరచుగా చెప్తున్నట్లు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి భారత్ సాయమందిస్తోందన్నారు. ఇందులో భాగంగా పాకిస్తాన్, ఆఫ్గన్ సరిహద్దుల్లో కొన్ని బృందాలను భారత్ నియమించిందని ఆరోపించారు.

English summary
China has made a mistake by including terrorist groups based in Pakistan and Afghanistan in the Xiamen declaration as the move could prove costly for its ties with countries in the region, experts said. Also, they said the agenda of Brics, which is an economic forum, was hijacked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X