వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెర్కెల్ మెరుపులు, వరుసగా నాలుగోసారి ఛాన్సలర్‌గా..

జర్మనీలో మెర్కెల్ మళ్లీ మెరుపులు మెరిపించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో జర్మనీ ఛాన్సలర్‌గా వరుసగా నాలుగోసారి ఆమె విజయం సాధించారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బెర్లిన్‌: జర్మనీలో మెర్కెల్ మళ్లీ మెరుపులు మెరిపించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో జర్మనీ ఛాన్సలర్‌గా వరుసగా నాలుగోసారి ఆమె విజయం సాధించారు. దీంతో ఆమె ప్రాతినిధ్యం వహించిన క్రిస్టిన్‌ డెమక్రటిక్‌ యూనియన్‌ (సీడీయూ) అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది.

ఎగ్జిట్‌ పోల్స్‌లో చెప్పినట్లే క్రిస్టిన్‌ డెమక్రటిక్‌ యూనియన్‌ (సీడీయూ), క్రిస్టియన్‌ సోషల్‌ యూనియన్‌లు 33శాతం ఓట్లతో 238 స్థానాల్లో విజయం సాధించాయి. ఆమె ప్రధాన ప్రత్యర్థి మార్టిన్‌ స్కల్జ్‌ ప్రాతినిధ్యం వహించిన సోషల్‌ డెమక్రటిక్‌ పార్టీ 148 సీట్లను సాధించి ద్వితీయ స్థానంలో ఉంది.

Merkel heads for another term in Germany, but far right spoils the victory party

శరణార్థులకు ఆశ్రయం కల్పించడాన్ని వ్యతిరేకించిన ఏఎఫ్‌డీ పార్టీ 13.5శాతం ఓట్లు సాధించి 95 సీట్లలో విజయం సాధించి పరిశీలకుల్ని ఆశ్చర్యపర్చింది. జర్మనీ ఫెడరల్‌ బాడీ అయిన బుండెస్టాగ్‌లోకి ప్రవేశించింది.

ఇక వ్యాపారులకు మద్దతుగా నిలిచే ఎఫ్‌డీపీ 10 శాతం ఓట్లతో 80 సీట్లు సాధించింది. గ్రీన్స్‌పార్టీ 9 శాతం ఓట్లతో 67 సీట్లు సాధించింది. ఈసారి సీడీయూ ఎఫ్‌డీపీ , గ్రీన్స్‌పార్టీలోతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గతంతో పోల్చుకుంటే ఏంజెలా మెర్కెల్‌కు మెజార్టీ బాగా తగ్గింది. ఈసారి ఎస్‌డీపీ, ఏఎఫ్‌డీలు ప్రతిపక్షంలో ఉండనున్నాయి.

English summary
German Chancellor Angela Merkel was on course to claim a fourth term in office Sunday even as the far right spoiled her victory party, surging into Parliament for the first time in more than half a century, according to projections based on exit polls and official results following a nationwide vote. The results represented at least a partial affirmation of Merkel’s emphasis on Germany’s stability and economic prosperity at a time of upheaval elsewhere around the globe. They clear the way for her to extend her 12-year stewardship to 16, which would tie the record for postwar Germany.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X