వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెమెరాకు చిక్కిన ఆకాశంలో అద్భుతం(వీడియో)

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: ఆకాశంలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. కానీ, మనం అన్నింటినీ చూడలేం. తాజగా, ఆకాశంలో జరిగిన అద్భుత దృశ్యాలు పోలీసుల డ్యాష్ కెమెరాకు చిక్కాయి. మంగళవారం అర్ధరాత్రి 12.50 గంటల సమయంలో జరిగిన ఈ అద్భుతాన్ని తమ కెమెరాలో బంధించారు.

ఇద్దరు పోలీసు అధికారులు మాట్లాడుకుంటున్నారు. ఇంతలో దూరంగా స్పీడ్‌గా వెళుతున్న వాహనాల్ని చిత్రీకరించడానికి వారిలో ఒకతను తన డాష్‌బోర్డు కెమెరా తీసి అటువైపు తిప్పాడు. ఇంతలో ఆకాశంలో ఆ అద్భుతం చోటు చేసుకుంది.

 Meteor streaks across Maine sky in police dashcam video

నిప్పులు చిమ్ముతూ అగ్నిగోళాలు విశ్వం నుంచి భూమివైపుగా రాలిపడ్డాయి. దీంతో వెలువడిన ప్రకాశవంతమైన మెరుపు చాలా స్పష్టంగా కెమెరాలో చిక్కింది. అమెరికాలో, కెనడాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ అద్భుతం కనిపించింది. బహుశా ఒక ఉల్క రాలిపడిపోతూ భూ ఆవరణం సమీపంగా వచ్చి ఉంటుందని అంతరిక్ష నిపుణులు భావిస్తున్నారు.

పోర్ట్‌లాండ్‌ సెంట్రల్ ఫైర్‌ స్టేషన్‌కు చెందిన పోలీసు అధికారి టిమ్‌ ఫరీస్‌ కెమెరాలో ఈ అద్భుతం చిక్కింది. అదే సమయంలో ఆయనతోపాటు ఉన్న మరో అధికారి గ్రహం హల్ట్స్‌ 'ఓ మై గాడ్‌' అని అనడం ఈ వీడియోలో వినిపిస్తోంది.

నిజానికి ఈ అంతరిక్ష అద్భుతాన్ని ఈ ఇద్దరు పోలీసు అధికారులే కాదు, మైనీ, వెర్మోంట్‌, న్యూహాంప్‌షైర్‌, మసాచుసెట్స్‌, రోడె ఐలాండ్‌, కనెక్టికట్, న్యూయార్క్‌, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, కెనడాలోని కొన్ని ప్రాంతాల్లో వందలమంది చూశారు. చాలామంది ఈ అద్భుతాన్ని తమ కెమెరాలో బంధించి యుట్యూబ్‌లో పోస్టు చేశారు.

English summary
A fiery meteor streaked across the sky early on Tuesday morning and was captured by a police dashboard camera.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X