వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లైంగిక వేధింపులపై నోరువిప్పుతున్న మహిళలు! ట్రెండింగ్ గా మారిన #MeToo

లైంగిక వేధింపుల‌కు గురైన మ‌హిళ‌లంతా బ‌య‌ట‌కు రావాల‌ని, ఇందుకోసం #MeToo అనే ట్యాగ్‌ను ఉప‌యోగించాల‌ని అమెరిక‌న్ న‌టి అలిసా మిలానో కోరారు. దీనికి మ‌హిళా లోకం స్పందించింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్ స్టెయిన్ లైంగిక వేధింపులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. అతడు తమను లైంగికంగా వేధించాడంటూ ఇప్పటి వరకు దాదాపు 30 మంది న‌టీమ‌ణులు తమ అనుభవాలను బ‌య‌ట‌పెట్టారు.

దీంతో హార్వీ వృత్తిగ‌త, దాంప‌త్య‌ జీవితానికి దూర‌మ‌య్యారు. వారంతా త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేయ‌డం వ‌ల్లే ఇది సాధ్య‌మైంద‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జరిగింది. ఈ నేఫ‌థ్యంలోనే లైంగిక వేధింపుల‌కు గురైన మ‌హిళ‌లంతా బ‌య‌ట‌కు రావాల‌ని అమెరిక‌న్ న‌టి అలిసా మిలానో కోరింది. ఇందుకోసం #MeToo అనే ట్యాగ్‌ను ఉప‌యోగించాల‌ని కోరింది.

#MeToo: Sexual abuse stories pour out on social media

న‌టి అలిసా మిలానో చొర‌వ‌కు చాలా మంది మ‌హిళ‌లు స్పందించారు. సెలెబ్రిటీలు, సాధార‌ణ మ‌హిళ‌లు ఇలా ప్ర‌తి ఒక్క‌రూ త‌మ‌కు జ‌రిగిన లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా గళం విప్పుతున్నారు.

సినిమా, రాజ‌కీయం, కార్పొరేట్‌, ఐటీ ఇలా అన్ని రంగాల్లో ప‌నిచేస్తున్న మ‌హిళ‌లు త‌మ‌కు వివిధ చోట్ల జ‌రిగిన వేధింపుల పర్వాన్ని ఆన్ లైన్ లో పంచుకుంటున్నారు. వీరంతా #MeToo ట్యాగ్ ద్వారా ప్ర‌చారం చేస్తుండడంతో కొద్దిగంట‌ల్లోనే ఈ #MeToo సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

English summary
Celebrities and everyday people flooded social media with personal accounts of sexual assault and harassment Monday, responding to calls to break the culture of silence around such abuse. The massive global response was triggered by allegations recently made public against Hollywood mogul Harvey Weinstein, who is accused of rape and abuse dating back decades. People shared stories and offered support under multiple hashtags, including #MeToo in English, #balancetonporc ("Rat out your pig") in French, and #quellavoltache ("That time that") in Italian. American actress Alyssa Milano sparked the outpouring with a simple Twitter request Sunday that women respond "me too" if they have also been sexually harassed or assaulted. Tens of thousands of people replied, making #MeToo the top trending topic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X