వక్షోజాలు చూడండి!: మహిళా పోలీస్ టాప్‌లెస్ సెల్ఫీ
మెక్సికో: ఓ మహిళా పోలీసు అధికారిణి టాప్ లెస్‌గా సెల్ఫీ తీసుకోవడమే కాకుండా, దానిని సామాజిక అనుసంధాన వేదిక ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. దీంతో ఆమెను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఆ మహిళ ఏకంగా పెట్రోలింగ్ కారులోనే టాప్ లెస్ సెల్ఫీ దిగింది.
మెక్సికోలోని ఎస్కోబెడోలో పెట్రోలింగ్ చేస్తున్న కారులో నిదియా కార్సియా అనే పోలీస్ అధికారిణి టాప్ లెస్‌గా సెల్ఫీ తీసుకుంది. తన యూనిఫాంను కిందకు దించి రొమ్ము భాగం కనిపించేలా సెల్ఫీ తీసుకుంది. వెంటనే ఆ ఫోటోను ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఇది సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.
విషయం ఉన్నతాధికారుల వరకు వెళ్లింది. విచారణకు ఆదేశించారు. డ్యూటీలో, యూనిఫాంలో ఉండగానే ఆమె ఆయుధాలను పక్కన పెట్టి సెల్ఫీ దిగిందని గుర్తించారు. దీంతో అధికారులు ఆమె పైన చర్యలు తీసుకున్నారు. ఆమె సెల్ఫీ తీసుకున్న సమయంలో ఇతర సిబ్బంది ఎవరైనా పక్కన ఉన్నారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
మరో విషయమేమంటే.. తన టాప్ లెస్ సెల్ఫీ పైన ఆ మహిళా అధికారిణి ఆ తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. అలా చేసినందుకు నన్ను నేనే అసహ్యించుకుంటున్నానని, ఇద్దరు పిల్లలకు తల్లి అయినా తాను ఇలా చేయడంపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపిందని తెలుస్తోంది. తాను తన కుటుంబానికి చెడ్డపేరు తెచ్చానంది.