వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ మరో షాక్: మెక్సికో గోడ నిర్మాణానికి డబ్బు రాబట్టేందుకు..

మెక్సికో నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే ఉత్పత్తులపై ఇరవై శాతం పన్ను విధించాలని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదించారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: మెక్సికో నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే ఉత్పత్తులపై ఇరవై శాతం పన్ను విధించాలని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదించారు. అమెరికా-మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి సంబంధించి ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం విషయం తెలిసిందే.

అయితే గోడ నిర్మాణానికి మెక్సికో నుంచి డబ్బు రాబట్టేందుకు ఆ దేశ దిగుమతులపై అధిక పన్నులు విధించడం ఒక మార్గమని భావిస్తున్నారు. ఈ పన్నుల ప్రతిపాదన ప్రభావం భారత్‌, చైనా వంటి దేశాల దిగుమతుల పైనా పడే అవకాశముందంటూ శ్వేత సౌధం ప్రెస్‌ సెక్రటరీ సీన్‌ స్పైసర్‌ వెల్లడించారు.

 Mexico’s President Cancels Meeting With Trump Over Wall

అయితే ప్రస్తుతానికి ఈ ప్రతిపాదన కేవలం మెక్సికో వరకు మాత్రమేనని చెప్పారు. ఈ పన్ను ప్రతిపాదనలు తొలి దశలోనే ఉన్నాయని ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు.

ట్రంప్‌ చర్యపై మెక్సికో అధ్యక్షులు ఎన్రిక్‌ పెనా నీటో మండిపడ్డారు. గోడ నిర్మాణానికి డబ్బు చెల్లించకపోతే నీటో అమెరికా పర్యటనకు కూడా రావాల్సిన అవసరంలేదని ట్రంప్‌ ట్వీట్‌ చేయడంతో.. నీటో తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు.

సరిహద్దుల్లేని దేశం దేశమే కాదని, ఈ రోజు నుంచి అమెరికా తన సరిహద్దులపై పూర్తి నియంత్రణ సాధిస్తుందని ట్రంప్ అన్నారు. కాగా, అమెరికా - మెక్సికోలు 3,100 కిలో మీటర్ల సరిహద్దులను పంచుకుంటాయి. ఇందులో 1600 కిలోమీటర్లకు మాత్రమే గోడ నిర్మిస్తారు. మిగిలిన చోట్ల కంచె, అక్కడక్కడ సిమెంటు స్లాబులతో కట్టిన సరిహద్దు ఉంది.

English summary
Mexico’s President Cancels Meeting With Trump Over Wall.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X