వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా ఆంక్షలపై మాదైన శైలిలో స్పందిస్తాం: మెక్సికో

అమెరికా, మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణ నిధుల కోసం మెక్సికోకు అమెరికా చేసే ఎగుమతులపై ప్రత్యేక పన్ను విధిస్తామనడాన్ని మెక్సికో తీవ్రంగా పరిగణించింది. ఇదే గనుక జరిగితే తమదైన శైలిలో స్పందిస్తామని

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

మెక్సికో: అమెరికా, మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణ నిధుల కోసం మెక్సికోకు అమెరికా చేసే ఎగుమతులపై ప్రత్యేక పన్ను విధిస్తామనడాన్ని మెక్సికో తీవ్రంగా పరిగణించింది. ఇదే గనుక జరిగితే తమదైన శైలిలో స్పందిస్తామని పేర్కొంది.

మెక్సికో విదేశంగ శాఖ మంత్రి లూయిస్ విడ్ గర్రే మాట్లాడుతూ మెక్సికోకు ఎగుమతి చేసే అమెరికా ఉత్పత్తులపై ప్రత్యేక పన్నులు ఆ దేశం విధించనున్నట్లు తెలిపారు. దీనిపై తమదైన శైలిలో స్పందిస్తామని మెక్సికో తెలిపింది.

Mexico warns US over border wall funding

ఇప్పటి వరకు మెక్సికో స్వేచ్ఛా వాణిజ్యాన్ని నమ్మతూ వస్తోందని.. కానీ ఇప్పుడు స్పందించాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన ఒక రేడియో ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అంతకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ గోడ నిర్మాణం త్వరలో ప్రారంభం కానుందని పేర్కొన్నారు.

దీనికి తగ్గట్లే అమెరికా వేగంగా చర్యలు చేపడుతోంది. వచ్చే నెలలో ఈ గోడకు సంబంధించిన డిజైన్ కు ఆమోదం తెలపనుంది. ఇప్పటికే బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెన్సీ మార్చి 6 నాటికి పలు కంపెనీలను డిజైన్లను సమర్పించాలని కోరింది. మార్చి 20 నాటికి వీటిల్లో కొన్నిటిని ఎంపిక చేస్తారు. ఈ గోడ నిర్మాణాన్ని షెడ్యూల్ కంటే ముందే పూర్తి చేస్తామని ట్రంప్ అంటున్నారు.

English summary
Mexico has warned the US against imposing a unilateral tax on Mexican imports to finance a border wall, saying it could respond in kind. Foreign Minister Luis Videgaray said the government could place tariffs on selected goods from US states reliant on exports to Mexico. Earlier, US President Donald Trump vowed to start building the wall "soon, way ahead of schedule". The US government says it will start accepting design proposals next month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X