వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దోషులు బోనెక్కాలి: జెట్ క్రాష్‌పై ప్రధాని నజీబ్ రజాక్

By Pratap
|
Google Oneindia TeluguNews

కౌలాలంపూర్ : మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ప్రమాదవశాత్తూ కూలిపోలేదని ఆదేశ ప్రధాన మంత్రి నజీబ్ రజాక్ అన్నారు. అది ప్రమాదం లాగే కనిపిస్తోందని, దాడి వల్లనే కూలిపోయిందని ఆయన అన్నారు. విమాన ప్రమాదంపై ఆయన శుక్రవారం స్పందించారు.

దుండగుల దుశ్చర్యవల్లే విమానం కూలిపోయిందని నిర్ధారించారు. ప్రమాదకర పరిస్థితులు ఉంటే ఫైలట్లు కౌలాలంపూర్ విమానాశ్రయానికి సమాచారం ఇస్తారని, ఈ కేసులో అలాంటి సమాచారం ఏదీ రాలేదని ఆయన వెల్లడించారు. సంఘటనా స్థలం నుంచి దేన్నీ కదలిచంకూడదని, దర్యాప్తు అధికారులకు అన్నీ అందుబాటులో ఉండాలని అన్నారు.

 MH17 crash: investigators must have full access to site, says Malaysian PM

దుండగులను గుర్తించిన వెంటనే ఉక్రెయిన్ ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నజీబ్ రజాక్ కోరారు. ఈ దుర్ఘటన గురించి నెథర్లాండ్, ఉక్రెయిన్, అమెరికా దేశాధినేతలతో చర్చించారు. అలాగే అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా తనకు ఫోన్ చేశారని, ఈ ఘటనపై ఎలాంటి ఆటంకాలు లేకుండా దర్యాప్తుకు సహకరిస్తామని చెప్పారని ఆయన అన్నారు.

ఘటనా స్థలం వద్ద అంతర్జాతీయ బృందానికి పూర్తి స్వేచ్ఛ ఉండాలని, అంతవరకు ఘటనా స్థలాన్ని ముట్టుకోకూడదని నజీబ్ రజాక్ వ్యాఖ్యానించారు. బ్లాక్ బాక్స్‌తో సహా విమాన శిథిలాలను ఎవరూ తరలించకూడదని ఆయన అన్నారు.

గురువారం ఆమ్‌స్టర్‌డ్యామ్‌ నుంచి కౌలాలంపూర్‌ వస్తున్న మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం రష్యా సరిహద్దులకు సమీపంలో ఉక్రెయిన్‌లో క్షిపణి దాడికి నేలకూలింది. విమానంలో ఉన్న 298 మంది దుర్మరణం చెందారు.

English summary
Malaysian Prime Minister Najib Razak has said that the Malaysia Airlines Flight MH17 which went down in eastern Ukraine did not give a distress call before it crashed, media reported on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X